Nikhil Siddharth: నిఖిల్‌ పాన్‌ ఇండియా మూవీ నుంచి అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఇంట్రో గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారు..

Nikhil Siddharth: 2019లో వచ్చిన 'అర్జున్‌ సురవరం' సినిమా తర్వాత నిఖిల్‌ నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందకు రాలేదు. అయితే నిఖిల్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు...

Nikhil Siddharth: నిఖిల్‌ పాన్‌ ఇండియా మూవీ నుంచి అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఇంట్రో గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 05, 2022 | 5:11 PM

Nikhil Siddharth: 2019లో వచ్చిన ‘అర్జున్‌ సురవరం’ సినిమా తర్వాత నిఖిల్‌ నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందకు రాలేదు. అయితే నిఖిల్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2, 18 పేజీస్‌ సినిమాలు ఎప్పుడో మొదలైనా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుకావడంతో ఈ రెండు చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇదిలా ఉంటే నిఖిల్‌ నటిస్తోన్న మరో చిత్రం ‘స్పై’. గ్యారీ హీహెచ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌ చిత్రంపై అంచనాలు పెంచేసింది.

ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు. నిఖిల్‌ నుంచి వస్తోన్న తొలి పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ లేక చాలా రోజులు అవుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఎట్టకేలకు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఇంట్రో గ్లింప్స్‌ పేరుతో జూన్‌ 6 (సోమవారం) ఉదయం 11.11 నిమిషాలకు అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో నిఖిల్‌ స్పై పాత్రలో నటించనున్నాడు. ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. మరి నిఖిల్‌ నటిస్తోన్న ఈ తొలి పాన్‌ ఇండియా యంగ్‌ హీరో రేంజ్‌ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..