AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: ఆ హీరోతో సినిమా అంటే కథ అడగకుండా చేసేస్తాను.. వరుణ్ తేజ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నాడు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయినా వరుణ్..తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడమే కాకుండా తన నటనతో ఆకట్టుకున్నాడు.

Varun Tej: ఆ హీరోతో సినిమా అంటే కథ అడగకుండా చేసేస్తాను.. వరుణ్ తేజ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
Varun Tej
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2022 | 4:41 PM

Share

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నాడు వరుణ్ తేజ్(Varun Tej). ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్..తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడమే కాకుండా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు. లవర్ బాయ్ గా సినిమాలు చేయడమే కాకుండా గద్దల కొండ గణేష్ లాంటి మాస్ కేరెక్టర్స్ తోను ఆకట్టుకున్నాడు వరుణ్. తాజాగా ఎఫ్ 3 సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకటేష్ తో కలిసి ఆకట్టుకున్నాడు వరుణ్. ఈ సినిమా కేవలం తొమ్మిది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తాజాగా ఎఫ్ 3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. 200 మంది ఆర్టిస్ట్ లతో రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి రెండున్న గంటల పాటు మీరు ఆనందంగా వుండాలని సినిమా తీసి మీ ముందుకు తెచ్చాం అన్నారు. డబ్బులు, కలెక్షన్స్ ఇవ్వలేని తృప్తి.. మీరు సినిమా చూశాక శభాస్ అంటే వస్తుంది. అది మాకు వందకోట్లు. ఎఫ్ 3 సినిమాకి మీరు చూపిన ఆదరణే మాకు వంద కోట్లతో సమానం. డీవోపీ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, లిరిక్ రైటర్స్, ఎడిటర్ , కెమరా వెనుక వున్న టెక్నికల్ టీం అందరికీ థాంక్స్. రాజేంద్ర ప్రసాద్ గారికి, అలీ, సునీల్, రఘుబాబు గారు.. ఇలా ఆర్టిస్ట్ లందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాతో ఆర్టిస్ట్ లందరికీ మంచి పేరు వచ్చింది. దీనికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి గారు. ఇంతమంచి సినిమా ఇచ్చిన అనిల్ గారికి కృతజ్ఞతలు. ఆయనకి ఒక యునిక్ స్టయిల్ వుంది. దాని వలనే వరుసగా ఆరు హిట్లు కొట్టారు. ఆరే కాదు ఇంకో ముఫ్ఫై ఆరు హిట్లు కొట్టాలి. నిర్మాత దిల్ రాజు గారు సినిమా పై ప్యాషన్ వున్న ప్రొడ్యుసర్, ఆయన చూడని కోట్లు లేవు. అయినా సినిమాని ఎంతో ప్యాషన్ తో చేస్తారు. వెంకటేష్ గారితో పని చేసిన ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇకపై వెంకటేష్ గారితో కాంబినేషన్ అంటే కథ అడగకుండా సినిమా చేసేస్తాను. వెంకటేష్ గారు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్.

ఇవి కూడా చదవండి