Kinnerasani: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ దేవ్ సినిమా.. కిన్నెరసాని స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వం వహిస్తుండగా..

Kinnerasani: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ దేవ్ సినిమా.. కిన్నెరసాని స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Kinnerasani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2022 | 12:03 PM

విజేత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు హీరో కళ్యాణ్ దేవ్. ఇటీవల సూపర్ మచ్చి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఆశిచినంతస్థాయిలో ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కిన్నెరసాని. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వం వహిస్తుండగా.. SRT ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ప్రసాద్ తళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 26న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

సెన్సేషనల్ సినిమాలతో రోజురోజుకీ తన స్థాయి పెంచుకుంటుంది జీ 5 సంస్థ. ఇప్పటికే ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు ఆసక్తికరమైన సినిమాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ5. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జీ 5లో విడుదల చేయనున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు. జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. వేద అనే అమ్మాయి.. తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు. రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయ ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?