Sitara Ghattamaneni: మహేష్ డాటర్ మల్టీటాలెంటెడ్.. గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న సీతు పాప.. నెట్టింట్లో వీడియో వైరల్..

ఇటీవల సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ ప్రమోషన్ వీడియోలో డ్యాన్స్‏తో అదరగొట్టింది.

Sitara Ghattamaneni: మహేష్ డాటర్ మల్టీటాలెంటెడ్.. గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న సీతు పాప.. నెట్టింట్లో వీడియో వైరల్..
Sitara
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2022 | 12:30 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార (Sitara Ghattamaneni) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి భారీగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. సింగింగ్, డ్యా్న్సింగ్, పెయింటింగ్ వీడియోస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటుంది సితార. అంతేకాకుండా.. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన వెకేషన్స్, చిన్నారులకు అవసరమైన వీడియోస్ షేర్ చేస్తుంది. ఇటీవల సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ ప్రమోషన్ వీడియోలో డ్యాన్స్‏తో అదరగొట్టింది. అలాగే ఇటీవల శ్రీరామనవమికి కూచిపూడి నృత్యంతో అభిమానులను మంత్రముగ్దులను చేసింది. మల్టీటాలెంటెడ్‏ గర్ల్‏గా పేరు సంపాదించుకుంది సితార. తాజాగా తాను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లుగా వీడియోను షేర్ చేసింది.

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఇద్దరూ గుర్రపు స్వారీలో ప్రావీణ్యం ఉన్నవారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి సినిమాలో గుర్రపు స్వారీలు చేసిన సన్నివేశాలున్నాయి. తాజాగా వారిద్దరి బాటలోనే నడుస్తోంది మహేష్ గారాలపట్టి సితార. తాను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ తన ట్రైనర్స్‏కు థ్యాంక్స్ చెప్పింది. ” టిల్‌బెర్రీ, బెర్టా అనే రెండు అత్యంత అందమైన, బలమైన, దయగల గుర్రాలపై నాకు గుర్రపు స్వారీ నేర్పించిన నా గురువులు మరియా, రోన్యాలకు ధన్యవాదాలు! నా గుర్రపు స్వారీ అనుభవాన్ని మీకు చూపించడానికి వేచి ఉండలేను” అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో సితారతోపాటు.. మహేష్ తనయుడు గౌతమ్ సైతం కనిపిస్తున్నాడు. గౌతమ్, సితార ఇద్దరూ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?