Bramhanandam: తెలుగు చిత్రపరిశ్రమకు బ్రహ్మానందం విన్నపం.. సినిమాల్లో వాళ్లు లేకపోయిన సరే కానీ..

వెంకటేష్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని.. గతంలోనూ ఆయన కామెడీ టైమింగ్ చూశామన్నారు. అలాగే వరుణ్ తేజ్ ఎక్కువగా మాట్లాడడు..

Bramhanandam: తెలుగు చిత్రపరిశ్రమకు బ్రహ్మానందం విన్నపం.. సినిమాల్లో వాళ్లు లేకపోయిన సరే కానీ..
Brahmanandam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2022 | 12:52 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 (F3)సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ మూవీ మే 27న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహన్ కీలకపాత్రలో నటించగా.. రాజేంద్రప్రసాద్, ప్రగతి, సునీల్ ముఖ్యపాత్రలలో నటించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా చిత్రబృందంతో కలిసి కమెడియన్ బ్రహ్మానందం చిట్ చాట్ నిర్వహించారు. వెంకటేష్, వరుణ్ తేజ్, అలీ, అనిల్ రావిపూడి ఈ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ తమ నటనతో అదరగొట్టారని.. ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. వెంకటేష్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని.. గతంలోనూ ఆయన కామెడీ టైమింగ్ చూశామన్నారు. అలాగే వరుణ్ తేజ్ ఎక్కువగా మాట్లాడడు.. అలాంటి కుర్రాడి చేత నత్తి ఉన్న వ్యక్తిగా అని మంచి కామెడీ అందించారు.. అలీ, రాజేంద్రప్రసాద్, రఘుబాబు ఇలా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తన నటనతో నవ్వులు పూయించారన్నారు. తెలుగులో ఉన్నంతమంది కమెడియన్స్ మరే దక్షిణాది ఇండస్ట్రీలో లేరన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు నా విన్నపం ఏంటంటే.. కమెడియన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ.. సినిమాలో కామెడీ మాత్రం ఉంచండి.. అంటూ చిత్రపరిశ్రమకు విన్నవించారు బ్రహ్మనందం. ఈ సినిమాలో తాను నటించాలని డైరెక్టర్ అనిల్ అడిగారని.. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ మూవీ చేయలేకపోయినట్లు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు