Director Vivek Athreya: ఆ అంశాలు వుంటే.. సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వదు.. వివేక్ ఆత్రేయ ఆసక్తికర కామెంట్స్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. వివేక్ ఆత్రేయ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Director Vivek Athreya: ఆ అంశాలు వుంటే.. సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వదు.. వివేక్ ఆత్రేయ ఆసక్తికర కామెంట్స్
Vivek Athreya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 05, 2022 | 4:17 PM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. వివేక్ ఆత్రేయ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మలయాళీ బ్యూటీ నజ్రియా తెలుగు లో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలకాబోతుంది. తాజాగా ఈ మూవీ దర్శకుడు వివేక్ ఆత్రేయ  సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివేక్ మాట్లాడుతూ..నాని ఇప్పటివరకూ ఇలాంటి పాత్రని చేయలేదు. చాలా డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఫన్ వుంటుంది. దాని వెనుక పెయిన్ వుంటుంది. ప్రతి మాట వెనుక భిన్నమైన లేయర్ వుంటుంది. ఐతే అవన్నీ లోపల పెట్టుకొని బయటకి మాత్రం ఏమీ కనిపించకుండా మాట్లాడే పాత్ర చేయడం అంత సులువు కాదు. నాని గారి ఫన్ గురించి చెప్పక్కర్లేదు. ఐతే ఇందులో ఖచ్చితంగా డిఫరెంట్ నానిని కొత్తగా చూడబోతున్నారు అన్నారు.

టీజర్, ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. టైటిల్ లో సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. ట్రైలర్ లో ఎమోషన్, ఫన్ చూపించాం. ట్రైలర్ చివర్లో నవ్వుకున్నారు. ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఏర్పడింది కదా.. సినిమా అంతా కూడా ఇంతే ఆసక్తికరంగా వుంటుంది. ఆ అంటే ఏమిటో అనేదే ఇందులో కీలకం. అది మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ పాయింట్ ఉంది. ఈజీగా హర్ట్ అయ్యే పాయింట్ అది. ఐతే ఎవరినీ హర్ట్ చేయకుండా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అని కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీశాం. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్’ యూ’ సర్టిఫికేట్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇందులో అభ్యంతరకరమైన అంశాలు వుంటే.. సెన్సార్ క్లీన్ యూ ఇవ్వదు అన్నారు.

అలాగే లీలా థామస్ పాత్ర చేయడానికి బలమైన పెర్ఫార్మర్ కావాలి. నజ్రియా అయితే ఆ పాత్రకు కరెక్టని భావించాం. ఆమెని అప్రోచ్ ఐతే లక్కీగా ఆమె అంగీకరించడం హ్యాపీగా అనిపించింది అన్నారు. ఈ కథలో చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఆ విషయాలు చెప్పడానికి నాకు కావాల్సిన లెంత్ ఇది. మంచి కథ తీశామని సినిమా యూనిట్ అంతా చాలా నమ్మకంగా వున్నాం. సినిమా చూస్తున్నపుడు లెంత్ ని ఫీలవ్వరు. చాలా సరదా హాయిగా గడిచిపోతుంది. ఇప్పటికీ ఇంటర్ క్యాస్ట్ వివాహాలకు చాలా అడ్డంకులు వున్నాయి. న్యూస్ లో రాకపోవడం, వినీవినీ రొటీన్ అయిపోవడం జరుగుతుంది కానీ చాలా మంది ఈ సమస్య ఎదుర్కుంటున్నారు. ఎన్నో పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి కదా. ఐతే మేము చాలా హ్యూమరస్ అప్రోచ్ తో ఈ కథని డీల్ చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు వివేక్.

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?