French Open 2022: రోలాండ్‌ గ్యారోస్‌లో రఫెల్‌ రాజసం.. రికార్డు స్థాయిలో 14వ సారి టైటిల్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్‌ బుల్‌..

French Open 2022: రెండు రోజుల క్రితమే 36 వ వసంతంలోకి అడుగిడిన నాదల్ ఆదివారం జరిగిన ఫైనల్లో ఏకపక్షంగా 6-1, 6-3, 6-0తో నార్వే యువ ఆటగాడు కాస్పర్ రూడ్‌ను సులభంగా ఓడించి.. 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

French Open 2022: రోలాండ్‌ గ్యారోస్‌లో రఫెల్‌ రాజసం.. రికార్డు స్థాయిలో 14వ సారి టైటిల్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్‌ బుల్‌..
Rafael Nadal
Follow us

|

Updated on: Jun 05, 2022 | 10:46 PM

French Open 2022: స్పెయిన్ లెజెండరీ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ (Rafael Nadal)   ఫ్రెంచ్ ఓపెన్ -2022 టైటిల్‌ను గెలుచుకున్నాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరొందిన నాదల్, క్లే కోర్టులో తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే 36 వ వసంతంలోకి అడుగిడిన నాదల్ ఆదివారం జరిగిన ఫైనల్లో ఏకపక్షంగా 6-1, 6-3, 6-0తో నార్వే యువ ఆటగాడు కాస్పర్ రూడ్‌ను సులభంగా ఓడించి.. 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయస్కెడిగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో రికార్డు స్థాయిలో 14వ సారి ఫైనల్ చేరిన నాదల్.. తన 100 శాతం విజయాల రికార్డును మరోసారి నిలబెట్టుకున్నాడు.

నాదల్‌ ముందు నిలవలేక..

ఇవి కూడా చదవండి

రోజర్ ఫెదరర్ నుంచి నోవాక్ జొకోవిచ్‌, ఆండీ ముర్రే వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం క్లే కోర్టులో నాదల్‌ను ఓడించలేకపోయారు. ఈనేపథ్యంలో మొదటిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరుకున్న ఎనిమిదో సీడ్ కాస్పర్ నాదల్‌ను నిలువరించడం కష్టమైంది. తొలి సెట్‌ను 6-1తో సులభంగా కైవసం చేసుకున్నాడు స్పెయిన్‌ బుల్‌. అయితే రెండో సెట్‌లో రూడ్ ప్రతిఘటించాడు. ఒక దశలో 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే నాదల్‌ అనుభవానికి తోడు కాస్పర్ చేసిన స్వీయ తప్పిదాలను సద్వినియోగం చేసుకుని వరుసగా ఐదు గేమ్‌లను గెలిచి 2-0తో ఆధిక్యంలో నిలిచాడు. ఇక మూడో సెట్‌లో కాస్పర్‌కు ఎలాంటి అవకాశమివ్వలేదు నాదల్‌. కాగా గతేడాది రఫెల్ నాదల్ టైటిల్ గెలవలేకపోయాడు. ఆ తర్వాత సెమీ ఫైనల్స్‌లో నోవాక్ జకోవిచ్ అతడిని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. ఈసారి క్వార్టర్‌ ఫైనల్‌లోనే నాదల్‌, జొకోవిచ్‌ తలపడగా స్పెయిన్‌ స్టార్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ తర్వాత జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తీవ్ర పోటీని ఎదుర్కొన్నాడు నాదల్. అయితే అదృష్టవశాత్తూ జ్వెరెవ్‌ గాయపడి మధ్యలోనే కోర్టు నుంచి నిష్క్రమించాడు. కాగా తాజా టైటిల్‌తో మరికొన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు రఫెల్‌. తన సమకాలీన ఆటగాళ్లైన రోజర్ ఫెదరర్, నోవాక్ జొకోవిచ్‌పై మరోసారి పైచేయి సాధించాడు. ఈ దిగ్గజ ఆటగాళ్ల ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉండగా.. నాదల్‌ ఖాతాలో 22 గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Salman Khan: బాలీవుడ్‌ భాయ్‌జాన్‌కు బెదిరింపు లేఖ.. సిద్ధూలానే హతమారుస్తామంటూ..

ENG vs NZ: కెప్టెన్సీ పోయినా రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రూట్‌.. ఆ దిగ్గజ ఆటగాడి సరసన చోటు..

వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..