- Telugu News Photo Gallery ENG vs NZ : England's Joe Root completes 1000 test runs against New Zealand, has done so against 7th team in Lord's Test
Joe Root: లార్డ్స్‌లో రికార్డుల పంట పండించిన రూట్.. ఆ విషయంలో విరాట్, విలియమ్సన్ కూడా వెనక్కే..
న్యూజిలాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Basha Shek | Edited By: Ravi Kiran
Updated on: Jun 06, 2022 | 6:36 AM

రూట్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్‌లపై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. భారత్‌పై అత్యధికంగా 2353 పరుగులు (24 మ్యాచ్‌లు) చేశాడు.

లార్డ్స్ టెస్టులో రూట్ సెంచరీ చేయడంతో పాటు 10,000 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌పై 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో రూట్ టెస్టు క్రికెట్‌లో 7 జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్‌లో పలు మార్పులు చేసింది. కెప్టెన్ మారిపోయాడు. కొత్త కోచ్ వచ్చాడు. జట్టులోని కొందరు ఆటగాళ్లు కూడా మారారు. అయితే ఎన్ని మార్పులున్నా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ గత ఏడాదిన్నరగా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో మరోసారి మూడంకెల స్కోరును చేరుకున్నాడు.

ఈ విషయంలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, కోహ్లీ లాంటి దిగ్గజాలు కూడా రూట్ వెనకే ఉన్నారు. స్మిత్ భారత్, ఇంగ్లండ్‌లపై మాత్రమే వెయ్యి పరుగులు పూర్తి చేయగా, విలియమ్సన్ పాకిస్థాన్‌పై మాత్రమే ఈ ఘనత అందుకున్నాడు.

రూట్‌తో పాటు, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లుగా పరిగణిస్తున్నారు. అయితే టెస్ట్ క్రికెట్‌లో వీరెవరూ రూట్‌కు సమీపంలో లేరు. కోహ్లీ ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై మాత్రమే 1000 రన్స్ కొట్టి రెండో స్థానంలో నిలిచాడు.

రూట్ సెంచరీ సాయంతో లార్డ్స్ టెస్టులో కివీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లండ్ జట్టు





























