- Telugu News Photo Gallery Cinema photos Nora Fatehi Zahra Khan Salman Khan Sara Ali Khan were seen having fun in the IIFA Rocks 2022 event.
IIFA Rocks 2022 : ఐఫా2022లో అందాల భామల మెరుపులు.. సందడి చేసిన బాలీవుడ్ తారలు..
మరోసారి అట్టహాసంగా ప్రారంభం అయినIIFA . బాలీవుడ్ తారలు కలిసి దుబాయ్ గడ్డపై అడుగుపెట్టారు. యాస్ ఐలాండ్ అబుదాబి హోస్ట్ చేస్తున్న IIFA షో 22వ ఎడిషన్ ఇది.
Updated on: Jun 05, 2022 | 10:27 PM

మరోసారి అట్టహాసంగా ప్రారంభం అయినIIFA . బాలీవుడ్ తారలు కలిసి దుబాయ్ గడ్డపై అడుగుపెట్టారు. యాస్ ఐలాండ్ అబుదాబి హోస్ట్ చేస్తున్న IIFA షో 22వ ఎడిషన్ ఇది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ , షాహిద్ కపూర్, అనన్య పాండే, రితేష్ దేశ్‌ముఖ్, హనీ సింగ్ వరకు స్టార్స్ అంతా అక్కడ సందడి చేశారు.

సింగర్ నేహా కక్కర్ తన భర్త రోహన్‌ప్రీత్‌తో కలిసి IIFA 2022 లో సందడి చేసింది. పాటల ద్వారా ఇటీవల మరణించిన సింగర్ కెకెను గుర్తు చేసుకున్నారు. నేహాతో పాటు అక్కడ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా అవార్డ్ ఫంక్షన్‌లోమెరిసింది

అభిషేక్ బచ్చన్ కూడా IIFA అవార్డ్స్‌లో తన డ్యాన్స్ తో అలరించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ IIFA అవార్డ్స్‌లో చాలా సరదాగా మూడ్‌లో కనిపించారు. సల్మాన్ , రితేష్ దేశ్‌ముఖ్ తో కలిసి సందడిగా కనిపించాడు.

సారా అలీ ఖాన్ IIFA అవార్డులలో మెరిసింది

రాపర్ హనీ సింగ్ , గురు రంధవా IIFA అవార్డ్స్‌లో స్టైలిష్ అవతారాలలో కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ పాటలతో అదరగొట్టారు.

టైగర్ ష్రాఫ్ ఈవెంట్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





























