- Telugu News Photo Gallery Spiritual photos Shankh benefits in telugu know the benefits of shankh many problems will be solved
Shankh Benefits: ప్రతిరోజూ శంఖం ఊదడం ద్వారా ఆధ్యాత్మికంగానే కాదు శారీరకంగా అద్భుతప్రయోజనాలు
Shankh Benefits: అమృతం కోసం చేపట్టిన సముద్ర మధన సమయంలో శంఖం ఉద్భవించిందని పురాణాల కథనం. పూజ సమయంలో శంఖం ఊదడం శుభప్రదంగా భావిస్తారు. శంఖాన్ని ఊదడం ద్వారా సానుకూల శక్తి ప్రవహిస్తుంది. శంఖం ఊదడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
Updated on: Jun 05, 2022 | 8:19 PM

హిందూ మతంలో, పూజ సమయంలో శంఖం ఊదడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శంఖం ఊదడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. ప్రతికూలత దూరమవుతుంది.

శంఖం ఉన్న ఇంట్లో విష్ణువు , లక్ష్మి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. శంఖం ఉన్న ఇంట్లో ఆనందం, సంపదల ఉంటుంది.. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన తర్వాత శంఖం ఊదడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

శంఖం ఊదడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. శంఖంలో నీటిని నింపి ఇంటినిండా చల్లడం కూడా చాలా మంచిదని భావిస్తారు. శంఖాన్ని ఊదడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి.శంఖాన్ని ఊదడం సంతోషం పెరుగుతుంది.

శాస్త్రవేత్తల ప్రకారం, శంఖాన్ని ఊదడం వల్ల పర్యావరణం శుభ్రంమవుతుంది. శంఖంనుంచి వెలువడే శబ్దం చుట్టూ వెలువడే బ్యాక్టీరియా, క్రిములను చంపుతుంది. అందువల్ల క్రమం తప్పకుండా శంఖాన్ని ఊదడం వల్ల పర్యావరణం శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంటుంది.

శంఖం వాయించడం ఆస్తమా రోగులకు ఎంతో మేలు చేస్తుంది. ఆస్తమా రోగులు క్రమం తప్పకుండా శంఖాన్ని ఊదవచ్చు. శంఖం ఊదడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. శంఖంలోని నీటిని తాగడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ నీటిలో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)





























