RRR Movie: చరణ్ ఎంట్రీ సీన్ కోసం జక్కన్న ఎంతో కష్టపెట్టాడో తెలుసా.? ఏకంగా 32 రోజుల పాటు..
RRR Movie: భారతదేశ సిని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ ఒకటి. రాజమౌళి (Rajamouli) అద్భుత దర్శకత్వ ప్రతిభ. రామ్‌చరణ్ (RamCharan), ఎన్టీఆర్‌ల...
RRR Movie: భారతదేశ సిని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ ఒకటి. రాజమౌళి (Rajamouli) అద్భుత దర్శకత్వ ప్రతిభ. రామ్‌చరణ్ (RamCharan), ఎన్టీఆర్‌ల (NTR) నటన సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టి అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాలో ఒక్కో సన్నివేశం ఒక్కో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ సీన్స్ కోసం రాజమౌళి ప్రత్యేక చొరువ తీసుకున్నారు. ఇలాంటి సన్నివేశాల్లో రామ్‌చరణ్ ఎంట్రీ సీన్ ఒకటి. పోలీస్ అధికారి పాత్రలో చెర్రీ అద్భుత నటనను కనబరిచారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సన్నివేశానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
32 day’s sequence anta ?? mind-blowing asalu ???
▶️ https://t.co/lK54zHAusz#RRR streaming in Telugu, Tamil, Kannada & Malayalam. Trending #1 Worldwide #RRRonZEE5 #RRRMOVIE#RRRoaringonZEE5 #TrendingonZEE5 #ZEE5RRRampage@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/v9ICemY8FY
— ZEE5 Telugu (@ZEE5Telugu) June 5, 2022
ఈ సన్నివేశం కోసం కోసం ఏకంగా 32 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారని చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే ఈ సన్నివేశానికి చేసిన వీఎఫ్‌ఎక్స్‌కు సంబంధించిన వీడియో సైతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. మరి ఈ అద్భుత ఫైటింగ్ సీక్వెన్స్‌ను ఎలా తెరకెక్కించారో మీరూ ఓసారి చూసేయండి..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..