Viral News: 8 ఏళ్ల క్రితం పోయిన బైక్.. సడన్ గా వచ్చిన చలాన్.. ఎవరు వాడుతున్నారని చెక్ చేయగా..

సుమారు ఎనిమిదేళ్ల పాటు బైక్‌ కోసం పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఉన్నట్లుండి ఒకరోజు హఠాత్తుగా ఒక ఈ- చలాన్‌ వచ్చింది. దీని సహాయంతో తన బైక్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారని తెలుసుకునేందుకు ప్రయత్నించాడు.

Viral News: 8 ఏళ్ల క్రితం పోయిన బైక్.. సడన్ గా వచ్చిన చలాన్.. ఎవరు వాడుతున్నారని చెక్ చేయగా..
Motor Bike
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 06, 2022 | 6:36 AM

సాధారణంగా చోరీకి గురైన బైక్‌లు అంత త్వరగా దొరకవు. పోలీసులు వాటిని పట్టుకునేలోపు నంబర్‌ ప్లేట్‌తో సహా బైక్‌ రూపురేఖలు కూడా మారిపోతుంటాయి. ఈక్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తి బైక్‌ కూడా ఇలాగే పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. సుమారు ఎనిమిదేళ్ల పాటు బైక్‌ కోసం పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఉన్నట్లుండి ఒకరోజు హఠాత్తుగా ఒక ఈ- చలాన్‌ వచ్చింది. దీని సహాయంతో తన బైక్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారని తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. తీరా చూస్తే.. పోలీసులే అతని బైక్‌ను నడుపుతున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు, అందుకే తనకు ఈ -చలానా వచ్చిందని తెలుసుకుని షాకింగ్‌కు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇమ్రాన్ అనే వ్యక్తి నడిపే హోండా సీడీ 70 బైక్.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం చోరీకి గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఇటీవల అతనికి ఒక ఈ-చలాన్ వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలో.. లాహోర్‌లోని సబ్జరార్ పరిసరాల్లో పోలీసు అధికారులే తన బైక్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుసుకుని ఇమ్రాన్ ఆశ్చర్యపోయాడు. దీంతో వెంటనే నేరుగా వెళ్లి చీఫ్ సివిలియన్ పర్సనల్ ఆఫీసర్ (సీసీపీఓ)కి ఫిర్యాదు చేశాడు. తన బైక్ తనకు ఇప్పించాలని కోరాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Salman Khan: బాలీవుడ్‌ భాయ్‌జాన్‌కు బెదిరింపు లేఖ.. సిద్ధూలానే హతమారుస్తామంటూ..

ENG vs NZ: కెప్టెన్సీ పోయినా రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రూట్‌.. ఆ దిగ్గజ ఆటగాడి సరసన చోటు..

వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..