AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెఫ్‌గా మారి కుకీస్ తయారు చేస్తున్న శునకం.. దత్తత తీసుకుంటామంటున్న నెటిజన్లు

Viral Video: తాజాగా ఓ కుక్క కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుక్క కుకీలను తయారు చేస్తోన్న వీడియో చక్కర్లు కొడుతోంది.

Viral Video: చెఫ్‌గా మారి కుకీస్ తయారు చేస్తున్న శునకం.. దత్తత తీసుకుంటామంటున్న నెటిజన్లు
Dog Funny Video Viral
Surya Kala
|

Updated on: Jun 06, 2022 | 8:17 AM

Share

Viral Video: సోషల్ మీడియా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అనంతరం.. ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎవరినైనా కలవాలంటే.. ఆన్‌లైన్‌లో చూస్తే సరి అనే ఆలోచన సర్వసాధారణంగా మారిపోయింది.  అంతేకాదు రోజు రోజుకీ రకరకాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. తమకు నచ్చిన జంవుతుల వీడియోలను షేర్ చేస్తూ.. తమ ఆనందాన్ని పదువురుకి పంచుతున్నారు. తాజాగా ఓ కుక్క కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుక్క  కుకీలను తయారు చేస్తోన్న వీడియో చక్కర్లు కొడుతోంది.

మనకు ఆకలిగా అనిపించిన వెంటనే ఏమైనా తినాలని భావిస్తాం.. వెంటనే వంటగదికి వెళ్లి ఏదైనా తయారు చేసుకోవాలని భావిస్తారు. అయితే ఇలా ఆలోచించేది మనుషులే కాదు కుక్కలకు కూడా ఆలోచిస్తారని తెలుసా..! ఇటీవలి కాలంలో,  కుక్కలు చెందిన ఇలాంటి వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో కుక్క ఒక ప్రొఫెషనల్ చెఫ్ లా.. చకచకా తన కోసం కుక్కీలను తయారు చేసుకోవడం కనిపిస్తుంది. కుక్క టాలెంట్ ను చూసిన నెటిజన్లు ఆ కుక్కకు అభిమానులుగా మారారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో..  ఓ అందమైన కుక్క చెఫ్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. తన కోసం కుకీలను తయారు చేసుకుంటుంది. కుకీస్ ను రెడీ చేసుకోవడానికి కుక్క చెఫ్ రూపాన్ని ధరించింది. వంటగదిలోకి ఎంట్రీ ఇచ్చి..   మొదటి కుకీల పేస్ట్‌ను సిద్ధం చేసింది. అనంతరం ఆ కుకీస్ ను బాగా కాల్చింది.  కుకీలు చాలా క్రిస్పీగా మారిన తర్వాత..  వాటిని చూస్తుంటే.. కుక్కీలు మార్కెట్‌లో దొరికే కుక్క ఫుడ్ లాగా కనిపిస్తున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో లైక్స్, వ్యూస్ తో సందడి చేస్తోంది. ఇక ఈ శునకం ప్రతిభకు ప్రజలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా కుక్క ప్రేమికులు తాము దత్తత తీసుకుంటామని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..