AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Addict Rooster: ఈ కోడిపుంజు మద్యానికి బానిస .. మందులేనిదే ముద్ద ముట్టదు.. నెలకి 2వేలు ఖర్చుపెట్టలేనంటున్న యజమాని

Liquor addict rooster: మహారాష్ట్రలోని ఒక కోడి మద్యానికి అలవాటు పడింది. దీనికి రోజూ ఎంతో కొంత మద్యం ఇవ్వకపోతే తినడానికి, త్రాగడానికి నిరాకరిస్తుంది.

Liquor Addict Rooster: ఈ కోడిపుంజు మద్యానికి బానిస .. మందులేనిదే ముద్ద ముట్టదు.. నెలకి 2వేలు ఖర్చుపెట్టలేనంటున్న యజమాని
Liquor Addict Rooster
Surya Kala
|

Updated on: Jun 05, 2022 | 5:43 PM

Share

Liquor addict rooster: మద్యం సరదాగా తాగడం మొదలు పెట్టి..దానికి బానిస అయ్యి.. మందు లేనిదే ముద్ద ముట్టని మందుబాబుల గురించి  తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే.. ఓ కోడిపుంజు కూడా తాను మందుబాబులకు ఏ మాత్రం తక్కువ కాదని అంటోంది. మందులేనిదే ముద్ద తినదు.. నీరు తాగదు. కోడిపుంజుని పెంచుకుంటున్న యజమాని.. దీనికి మందుకొనడానికి తన వల్లకాదు మహాప్రభో అంటున్నాడు. మరి మద్యానికి అలవాటు పడిన వింత కోడిపుంజు మహారాష్ట్రలో ఉంది. వివరాల్లోకి వెళ్తే..

భందారా న‌గ‌రానికి స‌మీపంలోని పున‌రావాస గ్రామం పిప్రీకి చెందిన భావుకాతోరే కి మద్యం అలవాటు లేదు.. అయితే ఇతనికి కోళ్లను, కోడిపుంజులు పెంచుకోవడం ఇష్టం.. అయితే తన జీవితంలో ఎప్పుడూ మద్యం ముట్టుకోని భావుకాతోరే.. ఇప్పుడు తనకు ఇష్టమైన కోడిపుంజుని బతికించుకోవడానికి రోజూ మద్యం కొనుక్కోవడానికి వెళ్తున్నాడు. కొన్ని నెలల క్రితం కోడిపుంజుకి వైద్యం చేసే  సమయంలో ఇచ్చిన మద్యం.. ఇప్పుడు కోడికి వ్యసనంగా మారింది.

భావుకాతోరే ఇంట్లో ఓ కోడిపుంజు సొంత మనిషిలా తిరుగుతుంది. దీనికి మనుషులకు పెట్టినట్లే ఆహారాన్ని అందిస్తాడు. అయితే కొన్ని నెలల క్రితం కోడి పుంజు హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. ఒక గ్రామస్థుడి సూచన మేరకు కోడి పుంజుకి మద్యం పట్టించాడు. మెల్లగా దాని ఆరోగ్యం మెరుగుపడసాగింది. అనంతరం కొద్దిరోజుల‌కే కోడిపుంజు కోలుకొని మ‌ళ్లీ య‌థావిధిగా తిర‌గ‌డం మొద‌లు పెట్టింది. ఇక కోడిపుంజు అరిస్తే.. దీని టోన్ మొత్తం గ్రామాన్ని నిద్రలేపేటంత ఆరోగ్యాన్ని సొంతం చసుకండి. అయితే ఇక్కడే వచ్చింది చిక్కంతా.. కోడిపుంజు మద్యానికి బానిసగా మారిపోయింది. మందు లేకుంటే బ‌త‌క‌లేని స్టేజ్ కు చేరుకుంది. మద్యం ఇవ్వకపోతే.. అది ఏమీ తినడం లేదు..తాగడం లేదు. దానిమీద ఉన్న ప్రేమతో భావుకాతోరే చేసేది ఏమీ లేక.. రోజూ కొంతమొత్తంలో మద్యం ఇస్తున్నాడు. ఇలా మద్యం తగిన అనంతరం మాత్రమే ఈ కోడిపుంజు.. ఏదైనా తింటుంది. తాగుతుంది.

చాలా సార్లు, స్థానిక మద్యం అందుబాటులో లేకపోవడంతో కోడిని సంతోషంగా ఉంచడానికి విదేశీ బ్రాండ్‌లను సైతం భావుకాతోరే కొనుగోలు చేయాల్సి వస్తుంది. మద్యం కొనుగోలుకు నెలకు రూ. 2,000 వెచ్చించాల్సి వస్తోంది. దీంతో  కోడిపుంజు తాగుడు మానిపించాలని వైద్యుడి వద్దకు వెళ్ళాడు. ఈ ఆల్కహాల్ వ్యసనం నుంచి ఈ కోడిపుంజు బయటపడాలంటే.. ఆల్కహాల్ వాసన వచ్చే విటమిన్ మాత్రలు ఇవ్వమని పశువైద్యులు చెప్పారు.  రోజు రోజుకీ ఆల్కహాల్ పరిమాణాన్ని తగ్గించాలని సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..