Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Widest Mouth: ప్రపంచంలో అతి పెద్ద నోరు గల స్త్రీ, పురుషులు ఎవరో తెలుసా.. నోరు తెరచి గిన్నిస్ బుల్‌లో చోటు దక్కించుకున్నారు..

ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు, ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తుల గురించి.. వారు సృష్టించిన రికార్డ్స్ గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నోరుగల మనిషి గురించి మీకు తెలుసా ?

Widest Mouth: ప్రపంచంలో అతి పెద్ద నోరు గల స్త్రీ, పురుషులు ఎవరో తెలుసా.. నోరు తెరచి గిన్నిస్ బుల్‌లో చోటు దక్కించుకున్నారు..
Lagrest Mouth Man And Woman
Follow us
Surya Kala

|

Updated on: Jun 05, 2022 | 7:54 PM

Widest Mouth: ప్రపంచం అనేక వింతలు, విశేషాలతో నిండి ఉంది. ప్రతిరోజూ ప్రకృతిలోని వింతలు గురించి వినడం చాలా అద్భుతం అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు అలాంటి వింతలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ రికార్డుగా మారతాయి . కొన్ని విషయాలు ఊహించిన దానికంటే చిన్నవిగా లేదా పెద్దవిగా ఉంటూ.. చరిత్రలో ఒక వింతగా నిలిచిపోతాయి. అలాంటి వింతల్లో మనుషులు కూడా ఉన్నారు. మనుష్యులే కాదు.. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు ఇలా అనేక అవయవాలు చాలా చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని లావుగా, కొన్ని సన్నగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు, ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తుల గురించి.. వారు సృష్టించిన రికార్డ్స్ గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే  ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నోరుగల మనిషి గురించి మీకు తెలుసా ? అవును, ప్రపంచంలో అలాంటి  వ్యక్తి ఉన్నాడు. ఇతని నోరు.. చాలా వెడల్పుగా ఉంటుంది. ప్రజలు సాధారణంగా తమ నోటిలో పెద్ద వస్తువుకి ఏకకాలంలో పెట్టుకోలేరు.. అయితే  ఈ వ్యక్తి మాత్రం తన నోటిలో ఏకంగా శీతల పానీయ డబ్బా ని పెట్టుకుంటాడు.

ఈ వ్యక్తి పేరు ఫ్రాన్సిస్కో డొమింగో జోక్విమ్. ఇతను ఆఫ్రికన్ దేశం అంగోలాకు చెందినవాడు.  ఇతను తన నోటి వల్ల ప్రపంచ ఖ్యాతిగాంచాడు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నోరు కలిగిన వ్యక్తిగా ప్రజలకు తెలుసు. అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఫ్రాన్సిస్కో నోరు 17 సెంటీమీటర్లు లేదా 6.69 అంగుళాల వరకు తెరుచుకుంటుంది. శీతల పానీయం డబ్బా మొత్తం తన నోటిలో పెట్టుకోగలడు. అతనిలోని ఈ ప్రత్యేక లక్షణం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో ఫ్రాన్సిస్కో తన నోరు తెరవడాన్ని చూడవచ్చు..

ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉన్న మహిళ ఎవరంటే.. సమంతా రామ్‌డెల్…  అమెరికాకు చెందిన సమంతా రామ్‌డెల్ అతిపెద్ద నోరు కలిగిన మహిళగా పేరు ఉంది . 32 ఏళ్ల సమంత 6.52 సెంటీమీటర్ల వరకు నోరు తెరవగలదు. ఆమె ఒక్కసారిగా బర్గర్ తినగలదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పెద్ద నోరు కారణంగా, సమంతా పేరు 2021 సంవత్సరంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..