Humanity: విధిరాతను తప్పించలేం.. ప్రాణం ఎవరిదైనా ఒకటే.. తమ కొడుకు మృతికి కారణమైన డ్రైవర్‌ను క్షమించమంటున్న తల్లిదండ్రులు..
ప్రాణం అందరిదీ ఒకటే.. ప్రాణానికి ప్రాణం ఖరీదు కాదంటూ.. రవీంద్రని క్షమించమని కోరుతున్నారు. అంతేకాదు పోయిన తమ కొడుకు ప్రాణం ఎలా తిరిగి రాదు ఇక రవీంద్ర కు శిక్ష వేస్తే తమకు ఏమి వస్తుంది అంటూ డ్రైవర్ పై పోలీసులు కేసు వద్దు నమోదు చేయవద్దని వారించారు.
Humanity: కొందరు తమను కాదని వ్యతిరేకించినా, తమకు ఏ చిన్న కష్టాన్ని కలిగించినా దానికి కారణమైన వ్యక్తి పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగి ఉంటారు.. అంతేకాదు.. అవతలి వ్యక్తిపై తమ వ్యతిరేకతను తెలియజేస్తూ.. ఏదొక విధంగా ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తుంటారు.. ఇక తమ ఫ్యామిలీ సభ్యుల మరణానికి కారణం అయినా వారి పట్ల అయితే.. తీవ్ర కోపం కలిగి.. వారికీ తగిన విధంగా శిక్షపడాలని కోరుకుంటారు. తమకు జరిగే వరకు పోరాటం చేస్తుంటారు. ఇది మనం సర్వసాధారంగా చూస్తున్నదే.. అయితే మహారాష్ట్రకు చెందిన తల్లిదండ్రులు మాత్రం తాము అందరికీ వ్యతిరేకం తమకు మానవత్వం ఉందంటూ నిరూపించారు.. తమ కన్న కొడుకు మరణానికి కారణమైన వ్యక్తిపై కోపం ప్రదర్శించకుండా అతనికి శిక్ష పడకుండా చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ముంబైలోని నేపియన్ సీ రోడ్డులో మనీష్ జరీవాలా దంపతులు బట్టల వ్యాపారం చేస్తుంటారు. ఈ దంపతులకు అమర్ జరీవాలా(43) అనే కుమారుడు ఉన్నాడు. మే 30న అమర్ జరీవాలా డ్రైవర్ సాయమ్తో బాంద్రా కారులో వెళ్తున్నాడు. వర్లి సీలింక్ బ్రిడ్జి పై నుంచి కారు వెళ్తున్న సమయంలో హఠాత్తుగా ఒక గాలిపటం అతని కారు విండ్‌షీల్డ్‌కి తగిలి పడిపోయింది. అంతేకాదు ఒక పక్షి కారుపై పడింది. అయితే పక్షి ప్రాణం కోసం ఆలోచించిన అమర్.. డ్రైవర్ సహా కారునుంచి దిగాడు.. ఇంతలో వెనుక నుంచి ఓ టాక్సీ ఇరువురిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన అమర్ అక్కడిక్కడే మరణించాడు. అమర్ జరీవాలా డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్ లీలావతి ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.
ఈ దారుణ ఘటనకు కారణమైన టాక్సీ డ్రైవర్ రవీంద్ర కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశంలో రవీంద్ర కుమార్ ను జైలుకు తరలించారు పోలీసులు. తమ కుమారుడు మృతిపై అమర్ తల్లిదండ్రులు స్పందిస్తూ.. రవీంద్ర తప్పు లేదని.. విధి రాతను ఎవరూ తప్పించలేరు.. ప్రాణం అందరిదీ ఒకటే.. ప్రాణానికి ప్రాణం ఖరీదు కాదంటూ.. రవీంద్రని క్షమించమని కోరుతున్నారు. అంతేకాదు పోయిన తమ కొడుకు ప్రాణం ఎలా తిరిగి రాదు ఇక రవీంద్ర కు శిక్ష వేస్తే తమకు ఏమి వస్తుంది అంటూ డ్రైవర్ పై పోలీసులు కేసు వద్దు నమోదు చేయవద్దని వారించారు.
రవీంద్రకు ఫ్యామిలీ ఉంటుంది.. ఇప్పుడు అతను జైలు కి వెళ్తే.. వారి పరిస్థితి ఏమిటి.. అతను ఏమీ కావాలని ఈ ప్రమాదం చేయలేదు కనుక తాము అతడిని క్షమించినట్లు చెప్పారు. మానవతా దృక్పధంతో అతడిని విడిచి పెట్టమంటూ పోలీసులను అమర్ తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే రవీంద్ర కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. చట్టం తమని తాము చేసుకుని పోతుందని అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..