Odisha: ఒడిశాలో 20 మంది మంత్రుల రాజీనామా.. రేపు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
ఒడిశాలో(Odisha) మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలోని 20 మంది మంత్రులు తమ పదవిని త్యజించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే...
ఒడిశాలో(Odisha) మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలోని 20 మంది మంత్రులు తమ పదవిని త్యజించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంలో నవీన్(Naveen Patnaik) సర్కార్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నియమితులయ్యే మంత్రులు రేపు (ఆదివారం) రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. రాజీనామా చేసిన వారిలో కొందరిని మళ్లీ కేబినెట్ లో తీసుకోనున్నట్లు సమాచారం. మంత్రివర్గం నుంచి తప్పించిన వారికి పార్టీలో ముఖ్యమైన పదవులు కట్టబెట్టాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాగా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలే మూడేళ్లు పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటే ఒడిశాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఐదో పర్యాయం అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మరోసారీ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి చెడ్డపేరు వస్తుండడంతో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు నవీన్ పట్నాయక్ సిద్ధమయ్యారని సమాచారం. 2019 ఎన్నికల్లో బిజూ జనతా దళ్ 114 స్థానాలు సాధించింది. బీజేపీకి 23, కాంగ్రెస్ 9, సీపీఎంకు ఒక స్థానం లభించాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి