AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: యాదాద్రి జిల్లాలో కలెక్టర్ సందడి.. తండావాసులతో కలిసి ఖోఖో ఆడిన కలెక్టర్ పమేలా

గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా మైదానాలు నిర్మించేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

Telangana: యాదాద్రి జిల్లాలో కలెక్టర్ సందడి.. తండావాసులతో కలిసి ఖోఖో ఆడిన కలెక్టర్ పమేలా
Collector Pamela Satpathy
Surya Kala
|

Updated on: Jun 04, 2022 | 3:10 PM

Share

Telangana: ఎప్పుడ మీటింగ్స్, సమీక్షలతో బీజీ ఉండే జిల్లా కలెక్టర్ (District Collector)  ఓ తండాలో సందడి చేశారు. గ్రామస్తులతో కలిసి సరదాగా ఆటలాడారు. యాదాద్రి జిల్లా (YadadriBhuvanagiri District) బీబీనగర్ మండలం మీది తండాలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ప్రారంభించారు. పల్లె ప్రగతి గురించి చిన్నచిన్న తండాల్లోనూ అవగాహన వచ్చిందని, పరిసరాల పరిశుభ్రత, నేడు పల్లెలో పచ్చదనం నెలకొందన్నారు కలెక్టర్. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా మైదానాలు నిర్మించేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

గ్రామంలో ఇప్పటివరకు రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ స్థంభాలు ఇచ్చామని ఆట వస్తువులు అందజేసేందుకు కృషి చేస్తానన్నారు. స్థలం ఉంటే క్రికెట్ మైదానం కూడా అవకాశం కల్పిస్తామని, యువత ఆట స్థలాలను ఉపయోగించుకోవాలని అన్ని ఆటలు ఆడాలని కలెక్టర్ కోరారు. పిల్లలు సెలవు రోజుల్లో ఆట స్థలాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. తెలంగాణ క్రీడా మైదానం ప్రారంభోత్సవ సందర్బంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గ్రామస్థులతో కలిసి ఖోఖో ఆడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..