Telangana: పిల్లాడి కోసం పెంపుడు తల్లి, జన్మనిచ్చిన తల్లి మధ్య వివాదం.. ఎక్కడంటే..?

నిజమాబాద్ నగరం లోని ఆనంద్ నగర్ కాలనీలో 4 నెలల బాబు కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం నెలకొంది. ఇందిర అనే మహిళ నాలుగు నెలల క్రితం ఓ బాలుడికి జన్మనిచ్చింది.

Telangana: పిల్లాడి కోసం పెంపుడు తల్లి, జన్మనిచ్చిన తల్లి మధ్య వివాదం.. ఎక్కడంటే..?
Mothers Love
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2022 | 2:49 PM

Telangana: నాలుగు నెలల ఓ చిన్నారి బాలుడు కోసం ఇద్దరు తల్లులు ఆరాటపడుతున్నారు.. తమకే ఆ బాలుడు కావాలంటూ పోరాడుతున్నారు. ఆ చిన్నారి బాలుడు తనకే కావాలంటూ ఓ వైపు కన్న తల్లి ఆందోళన బాట పడితే.. చిన్నారి కన్నయ్య తనవాడే అతను పెంచిన తల్లి పోరాడుతుంది. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నిజమాబాద్ నగరం లోని ఆనంద్ నగర్ కాలనీలో 4 నెలల బాబు కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం నెలకొంది. ఇందిర అనే మహిళ నాలుగు నెలల క్రితం ఓ బాలుడికి జన్మనిచ్చింది. అయితే ఈ బాలుడిని ఇందిర సోదరి స్వప్న..  సాయిలుతో కలిసి రూ. 40 వేల కు పసి కందును సునీత అనే మహిళకు విక్రయించింది. అయితే 4 నెలల తర్వాత తన బిడ్డ తనకు కావాలని కన్న తల్లి ఇందిర… పెంచిన తల్లి సునీత ఇంటి ముందు ఆందోళన చేపట్టింది.

బిడ్డను కన్న బిడ్డకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్న సునీత తన బిడ్డ తనకే కావాలంటూ వాగ్వాదానికి దిగింది. పిల్లాడిని డబ్బులు ఇచ్చి కొనే సమయంలో తాము రాతపూర్వకంగా బిడ్డను తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో కన్నతల్లి ఇందిర ఐదో టౌన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..