Telangana: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి డైవైడర్ ను ఢీకొని ట్రావెల్ బస్సు బోల్తా .. 10మందికి గాయాలు

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొండడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు.

Telangana: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి డైవైడర్ ను ఢీకొని ట్రావెల్ బస్సు బోల్తా .. 10మందికి గాయాలు
Nalgonda
Follow us
Surya Kala

|

Updated on: May 31, 2022 | 6:27 AM

Telangana: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు రక్తమోడుతున్నాయి. రోజులో ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్తలు వినిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం రక్తమోడుతున్న రహదారులు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. నిన్నటి ఘోర రోడ్డు ప్రమాదం ఘటన ఇంకా మరవక ముందే నేడు తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కందుకూరు కి వెళ్తున్న ఓ ప్రయివేట్ ప్రయివేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే..

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొండడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న వేములపల్లి పోలీసులు తక్షణమే క్షతగాత్రులకు సహాయక చర్యలను అందించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..