AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: 15 ఏళ్లకే చరిత్ర.. ఇప్పుడు మరో బాధ్యత.. వైభవ్ సూర్యవంశీ నయా టార్గెట్ ఇదే

Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే సిరీస్‌లో 151 పరుగులతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా కొత్త బాధ్యత చేపట్టనున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ సత్తా చాటేందుకు యువ సంచలనం సిద్ధమవుతున్నాడు.

Vaibhav Sooryavanshi: 15 ఏళ్లకే చరిత్ర.. ఇప్పుడు మరో బాధ్యత.. వైభవ్ సూర్యవంశీ నయా టార్గెట్ ఇదే
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Aug 11, 2026 | 5:05 PM

Share

Vaibhav Sooryavanshi: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఆటతీరుతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అనంతరం, జింబాబ్వే సిరీస్‌లో అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఒక వీడియోలో, నెట్స్‌లో డిఫెన్స్‌తో పాటు భారీ షాట్లు ఆడుతూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపించింది. Preparation అనే ఒకే ఒక్క క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో, ఆయన రాబోయే రెడ్ బాల్ క్రికెట్ సవాలుకు ఎంత సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తోంది.

జింబాబ్వే పర్యటనలో రికార్డుల మోత

ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటన వైభవ్‌కు ఎంతో బాగా కలిసివచ్చింది. మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 151 పరుగులు సాధించి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. ఈ క్రమంలో 50.33 సగటు, 196.10 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోవడమే కాకుండా, ఒక ఇన్నింగ్స్‌లో 81 రన్స్ బాదారు. ఆయన అందించిన అద్భుతమైన ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. భారత్ కూడా కొత్త టీ20 కెప్టెన్సీ నేతృత్వంలో ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

15 ఏళ్ల వయసులోనే చారిత్రాత్మక రికార్డు

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 15 సంవత్సరాల 99 రోజులు మాత్రమే. దీని ద్వారా భారతదేశం తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆడిన 6 టీ20 మ్యాచ్‌ల్లో 189.21 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు సాధించడమే కాక, అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.

దులీప్ ట్రోఫీలో పెద్ద బాధ్యత

వేగంగా దూసుకుపోతున్న వైభవ్ కెరీర్‌లో మరో మైలురాయి చేరింది. రాబోయే దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ సెలెక్టర్లు ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుండగా ఈస్ట్ జోన్ తమ తొలి మ్యాచ్‌ను నార్త్ ఈస్ట్ జోన్‌తో ఆడనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపిన వైభవ్, సుదీర్ఘ ఫార్మాట్ అయిన రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా అదే స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకుంటారని ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us