AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్ర గర్భంలో ఇరాన్ ఆపరేషన్.. అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను పట్టుకున్నామన్న IRGC!

హోర్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను తాము స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ IRGC ప్రకటించింది. ఇది నెలలో రెండవ సంఘటన కాగా, నిఘా ఆపరేషన్లకు వినియోగిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది. అయితే అమెరికా ఈ వాదనను తిరస్కరించింది. ఈ ఘటన ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఆందోళనలను పెంచుతోంది.

సముద్ర గర్భంలో ఇరాన్ ఆపరేషన్.. అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను పట్టుకున్నామన్న IRGC!
Us Surveillance Drone
Balaraju Goud
|

Updated on: Sep 28, 2026 | 12:46 PM

Share

హోర్ముజ్ జలసంధిలో మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికాకు చెందిన అధునాతన మానవరహిత జలాంతర్గత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళం ప్రకటించింది. సెప్టెంబర్ 27న ఈ ప్రకటన వెలువడగా.. వాహనం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు తమ నిపుణులు పనిచేస్తున్నారని ఇరాన్ తెలిపింది.

IRGC ప్రకటన ప్రకారం.. నిఘా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను ఉపయోగించిన సమన్వయ, సంక్లిష్ట ఆపరేషన్‌లో ఈ అండర్‌వాటర్ డ్రోన్‌ను అడ్డుకున్నట్లు పేర్కొంది. తొలుత దీనిని అమెరికా సైన్యం ఉపయోగించే REMUS 600గా గుర్తించింది. ఈ వాహనం నిఘా కార్యకలాపాలకు ఉపయోగించబడుతోందని ఇరాన్ ఆరోపించింది. పట్టుబడిన వాహనాన్ని తమ నిపుణులు పరిశీలిస్తూ, అందులోని డేటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

అయితే ఈ వాదనపై అమెరికా వైపు నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. అమెరికా సెంట్రల్ కమాండ్.. తమ అన్ని ఆపరేషనల్ మానవరహిత వ్యవస్థలు తమ ఆధీనంలోనే ఉన్నాయని, ఇరాన్ చేసిన స్వాధీనం వాదనను తిరస్కరించింది. దీంతో ఈ ఘటనపై ఇరువైపుల వాదనలు భిన్నంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా, తాజాగా IRGC ప్రతినిధి ఈ వాహనాన్ని Mk 18 Mod 2 Kingfishగా పేర్కొన్నట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. అంటే తొలుత వెల్లడించిన రెమస్-600 గుర్తింపులో మార్పు చోటుచేసుకుంది.

ఇది ఈ నెలలో ఇరాన్ ప్రకటించిన రెండో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్ స్వాధీనం ఘటన. సెప్టెంబర్ 8న హోర్ముజ్ ప్రవేశద్వారం వద్ద మరో అమెరికా మానవరహిత జలాంతర్గత వాహనాన్ని పట్టుకున్నట్లు IRGC ప్రకటించింది. దానిని Dive-LDగా గుర్తించింది.

మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతపై కూడా IRGC తన వైఖరిని పునరుద్ఘాటించింది. అనుమతి లేని రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
భోజనాల్లో 2కేజీల మటన్ కూర ఇలా వండితే 10 మందికి మంచిగా పెట్టొచ్చు
భోజనాల్లో 2కేజీల మటన్ కూర ఇలా వండితే 10 మందికి మంచిగా పెట్టొచ్చు
ఎక్కువ మసాలా లేకుండా .. పాతకాలం పద్దతిలో రుచికరమైన కోడి కూర..
ఎక్కువ మసాలా లేకుండా .. పాతకాలం పద్దతిలో రుచికరమైన కోడి కూర..
ఇట్స్ అఫీషియల్.. OTTలో రీసెంట్ బ్లాక్ బస్టర్..తెలుగులోనూ చూడొచ్చు
ఇట్స్ అఫీషియల్.. OTTలో రీసెంట్ బ్లాక్ బస్టర్..తెలుగులోనూ చూడొచ్చు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా రెడీ..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా రెడీ..
తిత్తి తీస్తామంటున్న డెమొక్రాట్లు.. ఇన్వెస్టర్ల గుండెల్లో రాళ్లు
తిత్తి తీస్తామంటున్న డెమొక్రాట్లు.. ఇన్వెస్టర్ల గుండెల్లో రాళ్లు
ఈ దీపావళికి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ పన్నీర్ కలాకంద్
ఈ దీపావళికి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ పన్నీర్ కలాకంద్
బాస్ డబ్బుతో లగ్జరీ లైఫ్‌.. రూ. కోట్లు కొట్టేసిన కిలేడీ!
బాస్ డబ్బుతో లగ్జరీ లైఫ్‌.. రూ. కోట్లు కొట్టేసిన కిలేడీ!
తెలంగాణలో అక్రమ IVF కేంద్రాలకు చెక్.!
తెలంగాణలో అక్రమ IVF కేంద్రాలకు చెక్.!