AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. తన చివరి మ్యాచ్ డేట్ ఫిక్స్ చేసేసిన కింగ్ కోహ్లీ.. ఎప్పుడంటే?

Virat Kohli Last ODI Match: వెస్టిండీస్ సిరీస్ కు ముందు టీం ఇండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ తన అంతర్జాతీయ కెరియర్లో చివరి ఐసీసీ టోర్నమెంట్ అని పేర్కొన్నారు. వరల్డ్ కప్ గెలవడం అంతిమ లక్ష్యమని, ఇందుకోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యానని 37 ఏళ్ల కోహ్లీ తెలిపారు. అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీని సెలక్టర్లు జట్టు నుంచి తప్పించరని స్పష్టమవుతోంది.

Virat Kohli: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. తన చివరి మ్యాచ్ డేట్ ఫిక్స్ చేసేసిన కింగ్ కోహ్లీ.. ఎప్పుడంటే?
Ind Vs Wi Virat Kohli Last Match
Venkata Chari
|

Updated on: Sep 28, 2026 | 11:45 AM

Share

Virat Kohli Last ODI Match: టీం ఇండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కు ముందు సంచలన వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందని ఆయన స్పష్టం చేశాడు. భారత్ తరపున 2027 వన్డే వరల్డ్ కప్ తన అంతర్జాతీయ కెరీర్లో చివరి ఐసీసీ టోర్నమెంట్ కానుందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మెట్ లో మాత్రమే ఆడుతున్నానని, ఇప్పటికే టీ20, టెస్టులకు గుడ్ బై చెప్పానని ఆయన తెలిపాడు. ఈ ప్రకటన క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు కోహ్లీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. “టీం ఇండియా తరపున నేను ఆడబోయే చివరి వరల్డ్ కప్ ఇదే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిరీస్ కు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాను. వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడం అనేది నా అంతిమ లక్ష్యం. ఈ ప్రయాణం ఎక్కడి దాకా సాగుతుందో నాకు తెలియదు. కానీ, అన్నింటికీ నేను సిద్ధంగానే ఉన్నాను” అని కోహ్లీ దృఢంగా తెలిపాడు. ఆయన మాటలు రాబోయే టోర్నమెంట్ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని, లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఎక్కువమంది చదివినది: నా టార్గెట్ ఫిక్స్.. అందుకోసం అడ్డొచ్చినోళ్లను తొక్కి పడేసుడే.. విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 6 వన్డేలు ఆడిన కోహ్లీ 384 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో 3 అర్ధ శతకాలు నమోదు చేశాడు. అంతేకాదు, గత 10 వన్డే ఇన్నింగ్స్ లలో 3 సెంచరీలు చేయడంతో పాటు 5 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఈ గణాంకాలు కోహ్లీ ఎంత సూపర్ ఫామ్‌లో ఉన్నాడో స్పష్టంగా తెలుపుతున్నాయి. ఈ అద్భుతమైన ఫామ్‌ను బట్టి చూస్తే, 37 ఏళ్ల కోహ్లీని వన్డే వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించే సాహసం టీమిండియా సెలక్టర్లు చేయరని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కోహ్లీ తన అనుభవంతో పాటు బ్యాటింగ్ తో జట్టుకు బలమైన వనరుగా నిలుస్తున్నాడు.

ఎక్కువమంది చదివినది: టాస్ కూడా పడకుండానే ముగిసిన మ్యాచ్.. నేరుగా సెమీస్‌లోకి భారత్

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు ఆయన్ను క్రికెట్ దిగ్గజాలలో ఒకరిగా నిలబెట్టాయి. 2008లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన కోహ్లీ, సుదీర్ఘకాలంగా జట్టుకు సేవలు అందిస్తున్నాడు. టెస్టు క్రికెట్ లో 123 మ్యాచ్ లు ఆడి 30 సెంచరీల సహాయంతో 9230 పరుగులు సాధించాడు. 125 టీ20 మ్యాచ్ లలో ఓ సెంచరీ బాది 4188 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో ఆయన రికార్డులు మరింత అద్భుతం. ఇప్పటిదాకా 314 మ్యాచ్ లు ఆడి 14941 పరుగులు సాధించాడు. అంతేకాదు, 50 ఓవర్ల ఫార్మేట్లో అత్యధికంగా 54 సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డులు ఆయన అపారమైన ప్రతిభకు, నిలకడకు నిదర్శనం. చివరి వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా తన కెరీర్ ను ఘనంగా ముగించాలని కోహ్లీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

Follow Us
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య
సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య
చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు
చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు
గాలిలోకి ఎగిరిన ఆటో.. ముగ్గురు మహిళలు మృతి!
గాలిలోకి ఎగిరిన ఆటో.. ముగ్గురు మహిళలు మృతి!