AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జూబ్లీహిల్స్ ఘటనపై ముమ్మర దర్యాప్తు.. నిన్న ఇద్దరు.. ఇవాళ మరో ముగ్గురు

హైదరాబాద్(Hyderabad) జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపతట్టారు. విచారణ వేగవంతం చేయడంతో పాటు మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు...

Hyderabad: జూబ్లీహిల్స్ ఘటనపై ముమ్మర దర్యాప్తు.. నిన్న ఇద్దరు.. ఇవాళ మరో ముగ్గురు
Jubilee Hills
Ganesh Mudavath
|

Updated on: Jun 04, 2022 | 6:24 PM

Share

హైదరాబాద్(Hyderabad) జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపతట్టారు. విచారణ వేగవంతం చేయడంతో పాటు మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. కాగా.. నిన్ననే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో మేజర్లయిన ముగ్గురిని మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు.  మేజర్లయిన ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించారు. ఇద్దరు మైనర్లను జువైనల్‌ హోంకు తరలించారు.  జూబ్లిహిల్స్(Jubilee Hills) లోని పబ్‌లో పరిచయమైన బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఓ ప్రభుత్వ సంస్థకు ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు. ఆరు రోజుల క్రితం ఈ ఘటన జరగగా.. భయంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. బాలిక శరీరంపై గాయాలు చూసి, తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేశారు.

జరిగిన ఘటనతో షాక్ లోకి వెళ్లిన బాలిక తేరుకోవడంతో మహిళా పోలీసులు అనునయంగా మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నారు. తనపై కొందరు సామూహిక అత్యాచారం చేశారంటూ బాలిక చెప్పింది. దీంతో పోలీసులు అత్యాచారం సెక్షన్లు జోడించి ఇద్దరు నిందితులను నిన్న అదుపులోకి తీసుకోగా.. ఇవాళ మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే.. ఘటన జరిగిన ఇన్నోవా కారు ఎక్కడుందనే విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కారు ఆచూకీ దొరికితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై ఆబ్కారీ శాఖ ఆరా తీస్తోంది. మైనర్లను పబ్‌లోకి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీన వారిని ఎలా అనుమతించారని ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆబ్కారీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

బాలికపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ బీజేపీ నేతలు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. నేతలు ఠాణా వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. పోలీస్ స్టషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్‌ ఠాణాకు తరలించారు. ఈ పరిస్థితులతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సునీతారావు, అనిల్‌కుమార్‌ యాదవ్‌, బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ వద్దకు వచ్చారు. అత్యాచారం కేసులో పోలీసులు వివరాలు చెప్పడం లేదని, గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. హోంమంత్రి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం జరిగిందన్న వార్త విని తాను షాక్‌కు గురయ్యాయని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ఆవేదన చెందారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఎవరినీ వదిలిపెట్టొద్దని, ఎంతటి హోదా కలిగిన వారున్నా ఉపేక్షించవద్దని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి