Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనలో ఇన్నోవా కారు లభ్యం.. కీలక ఆధారాలు సేకరణ..!
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో నిన్న ఇద్దరిని అదుపులోకి తీసుకోగా,..
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో నిన్న ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, ఈ రోజు మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో మేజర్లయిన ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన ఇన్నోవాకారును జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇదే కారులో యువతిపై నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఎట్టకేలకు గుర్తించిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించిన పోలీసులు.
మే 28న పబ్‌లో పార్టీ ఇచ్చింది ఎవరు..? బాలికను తీసుకెళ్లిన ఇన్నోవా కారు ఎవరిది..? అయితే ఇన్నోవాకారులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే రెడ్ కలర్ మెర్సిడెజ్ బెంజ్ కారును స్వాధీనం ఎందుకు చేసుకున్నారు..? ఇలా రకరకాల సందేహాలు వ్యక్తం కాగా, శనివారం సాయంత్రం నగర శివారులోని మొయినాబాద్ ప్రాంతంలో నిందితులు అత్యాచారానికి పాల్పడేందుకు ఉపయోగించిన ఇన్నోవాకారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచార ఘటన కారులోనే జరగడంతో ఈకేసులో ఇన్నోవా కారు కీలక ఆధారంగా మారనుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి