Viral News: రెండోసారి ఆడపిల్లే పుట్టిందని కోడలిపై అత్తింటి సభ్యులు దాడి.. రోడ్డు మీద చిత్ర హింసలు..
ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చినందుకు ఓ మహిళపై భర్త, బంధువులు దాడి చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Viral News: మనిషి సాంకేతిక విజ్ఞానంతో ఆకాశాన్ని అందుకుంటున్నాడు.. సముద్రం లోతులను కొలుతున్నాడు.. సృష్టి రహస్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేస్తూ.. అద్భుతాలను రచించాడు రెడీ అవుతున్నాడు. అయినప్పటికీ ఇంకా మనిషి కొన్ని మూఢనమ్మకాల నుంచి బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఆడపిల్ల గురించి సమాజంలో ఉన్న ఫీలింగ్స్ ను బయటపడడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు, సామజిక కార్యకర్తలు ప్రజల్లో ఆడపిల్లల పట్ల ఉన్న తల్లిదండ్రుల్లో ఉన్న భావాలను తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేపట్టినా.. సమాజంలో ఎక్కడోచోట ఆడపిల్ల పుట్టిందని కోడలు అత్తవారింట్లో పెట్టె కష్టాలను ఎదుర్కొంటూనే ఉంది.. తాజాగా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చినందుకు ఓ మహిళపై భర్త, బంధువులు దాడి చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలోని రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త, బంధువులు దారుణంగా కొట్టిన వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. అత్తింటివారి దాడిలో తీవ్ర గాయాలపాలైన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
ఈ దాడికి గల కారణాలను ఆ మహిళ వివరిస్తూ.. తనకు రెండోసారి కూడా కొడుకు పుట్టలేదని భర్త, అత్తగారు బంధువులు తన పై దారుణంగా దాడి చేశారని చెప్పింది. రెండోసారి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అత్తవారింట్లోని కుటుంబ సభ్యుల చిత్రహింసలు ఎక్కువయ్యాయి. ఆ చిత్రహింసలు భరించలేక కూలి పనులకు వెళ్లడం మొదలుపెట్టాను’’ అని ఆ మహిళ చెప్పిందని పోలీసులు చెప్పారు.
ఇద్దరు మహిళలు ఆ మహిళను కొట్టడం వీడియోలో ఉంది. ఆ మహిళను కింద పడేసి కాళ్లతో తన్నారు. ఆ మహిళ తనను కొట్టడం ఆపమని ఏడుస్తూ వారిని వేడుకుంటోంది. అయితే ఇదంతా ఇరుగు పొరుగు వారు చూస్తూనే ఉన్నారు కానీ ఎవరూ అడ్డు చెప్పే ప్రయత్నం చేయలేదు.. అయితే వీడియో పోలీసులు దృష్టికి చేరుకోగానే వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మహిళను ఆస్పత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..