Narayana Murthy: IPO జోక్ కాదన్న నారాయణమూర్తి.. స్టార్టప్‌లు పేద ఇన్వెస్టర్ల గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్య..
Narayana Murthy: ఇటీవల జోమాటో, పేటీఎం వంటి అనేక స్టార్టప్ కంపెనీలు భారీ IPOలను చవిచూశాయి. ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీల్లో రిటైలర్లు భారీగానే డబ్బును ఇన్వెస్ట్ చేశారు.
Narayana Murthy: ఇటీవల జోమాటో, పేటీఎం వంటి అనేక స్టార్టప్ కంపెనీలు భారీ IPOలను చవిచూశాయి. ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీల్లో రిటైలర్లు భారీగానే డబ్బును ఇన్వెస్ట్ చేశారు. అయితే మార్కెట్లో ఈ కంపెనీల షేర్ల పనితీరు అందరినీ నిరాశపరిచాయి. ఇప్పటి వరకు చాలా మంది ఇన్వెస్టర్లు లక్షల రూపాయలు నష్టపోయారు. అయితే ఈ పరిస్థితులపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. ఐపీఓల్లో స్టార్టప్ కంపెనీలు చేస్తున్న హడావిడి సరైనది కాదని.. దీని వల్ల మెుత్తం వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. స్టార్టప్‌ల వ్యవస్థాపకులు ఐపీఓ తీసుకురావడం అనేది తమాషా కాదని.. బాధ్యతతో కూడిన చర్య అని అర్థం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
ఇటీవలి కాలంలో దేశంలో జోమాటో, పేటీఎం వంటి అనేక స్టార్టప్ కంపెనీలు భారీ IPOలను తీసుకొచ్చాయి. బెంగళూరులో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ కనెక్ట్ సదస్సులో నారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్టప్ కంపెనీలు ఐపీఓ తీసుకురావడంలో తొందరపాటు చూపుతున్న నేపథ్యంలో, స్టార్టప్ కంపెనీలకు నిధుల సమీకరణలో కొత్త రౌండ్ ఐపీఓ కాదన్నారు. IPOతో కంపెనీలకు అదనంగా బాధ్యతలు వస్తాయని ఆయన అన్నారు.
ఇన్ఫోసిస్ 1993లో లిస్ట్ అయినప్పుడు.. సహ వ్యవస్థాపకులమైన మేమంతా వాటాదారులకు శాశ్వత రాబడికి బాధ్యతను స్వంతంగా తీసుకున్నట్లు వెల్లడించారు. స్టార్టప్ కంపెనీలు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి చాలా ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. వారు తమ రాబడిని అనేక రెట్లు పెంచాలని లేదా వీలైనంత త్వరగా కంపెనీ నుంచి బయటకు రావాలని కోరుకుంటారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా అనేక స్టార్టప్ లు మార్కెట్లో లిస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి పెట్టుబడిదారు ఎదగడానికి స్టాక్ మార్కెట్‌కు వస్తుంటారని.. ఈ తరుణంలో చిన్న ఇన్వెస్టర్ల గురించి కంపెనీలు పట్టించుకోవాలని నారాయణ్ మూర్తి అన్నారు. కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందించే బాధ్యతను కలిగి ఉన్నందున.. IPO తీసుకురావడానికి ముందు దానిలో పెట్టుబడి పెట్టబోయే పేద రిటైల్ పెట్టుబడిదారుల గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించారు.