Corbevax vaccine: బూస్టర్ డోస్ గా కార్బెవాక్స్ కు అనుమతి.. దేశంలో మొదటి వ్యాక్సిన్ గా రికార్డ్
కరోనా(Corona) నుంచి మరింత రక్షణకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఈ మేరకు కొన్ని ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో బూస్టర్ డోస్ కోసం మరో టీకా డీసీజీఐ(DCGI) అనుమతి పొందింది...
కరోనా(Corona) నుంచి మరింత రక్షణకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఈ మేరకు కొన్ని ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో బూస్టర్ డోస్ కోసం మరో టీకా డీసీజీఐ(DCGI) అనుమతి పొందింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ రూపొందించిన కార్బెవాక్స్(Carbevax) టీకాను బూస్టర్ డోసుగా తీసుకునేందుకు అనుమతి లభించింది. ఈ టీకాను 18 ఏళ్లు పై బడిన వారికి బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించింది. గతంలో కొవిషీల్డ్ కానీ, కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ ఈ టీకాను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చని డీసీజీఐ వెల్లడించింది. అయితే.. దేశంలో బూస్టర్ డోస్ కు అనుమతి పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్‌గా కార్బెవాక్స్ రికార్డు సాధించింది. ఈ ఆమోదం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని, దేశంలోని బూస్టర్ డోసుల అవసరాన్ని పరిష్కరించే అవకాశం లభించిందని బయోలాజికల్-ఇ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు.. దేశంలో కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 4041 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ పదిమంది చనిపోయారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు- రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాలని కోరారు. పరిస్థితులకు తగినట్లు అప్రమత్తత పెంచాలని, కరోనా వ్యాప్తి అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని రాజేష్ భూషణ్ పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి