PM Modi: ఇజ్రాయెల్‌తో భారత్ కీలక ఒప్పందం.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై చర్చించారు. పలు ఒప్పందాలు ఈ సందర్భంగా చేసుకున్నారు. అనంరతం ఇద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కలిసి ప్రధాని మోదీ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. మానవత్వం ఎప్పుడూ సంఘర్షణ బాధితురాలిగా మారకూడదని, గాజా శాంతి ప్రణాళిక శాంతి వైపు ఒక మార్గాన్ని సృష్టించిందని అన్నారు. భారతదేశం ఈ శాంతి ప్రణాళికలకు పూర్తిగా మద్దతు ఇస్తుందని, భవిష్యత్తులో కూడా అన్ని దేశాలతో సంభాషణ, సహకారాన్ని కొనసాగిస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా తాము అంగీకరించే ప్రసక్తే లేదని మోదీ తేల్చేవారు. ఉగ్రవాదంతో పాటు దాని మద్దతుదారులను వ్యతిరేకించే వారితో కలిసి తాము కలిసి నడవడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు.
ఇదొక భావోద్వేగ క్షణం
ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే వారితో కలిసి తాము కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తామని, ప్రపంచంలో ఉగ్రవాదానికి అసలు స్థానమే లేదని ప్రధాని మోదీ ఈ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇజ్రాయెల్, భారత్ కలిసి క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీస్, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో సహకారానికి ఇది కొత్త ఊపునిస్తుందన్నారు. ఇజ్రాయెల్‌లో యూపీఐ వినియోగాన్ని అనుమతించడానికి దేశాల మధ్య జరిగిన ఒప్పందం పట్ల తాను సంతోషంగా ఉన్నాన్నారు. భారత్, ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహత్మక భాగస్వామ్యం పెంచుకున్నాయన్నారు. తొమ్మిది సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా తనకు గౌరవం దక్కిందని, ఇప్పుడు రెండోసారి పర్యటించానని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్‌ను రెండోసారి సందర్శించడం తనకు దగ్గిన గర్వకారణమని మోదీ అన్నారు. ఇదొక భావోద్వేగం కలిగించే క్షణం అన్నారు
