దేశీయ వినియోగం కోసం యూపీఐని స్వీకరించిన తొలి విదేశీ దేశం నేపాల్. ఈ వ్యవస్థ నేపాల్‌లో డిజిటల్ చెల్లింపులను, భారతదేశం నుండి డబ్బు పంపడాన్ని అనుమతిస్తుంది
నేపాల్
2021 నుండి భూటాన్‌లో వ్యాపారులతో పాటు పర్యాటక ప్రాంతాల్లో UPI చెల్లింపులు జరుుతున్నాయి. దీని వల్ల భారత టూరిస్టులకు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
భూటాన్
2024లో ఈఫిల్ టవర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో UPIని ప్రవేశపెట్టారు. ఇది భారత ప్రయాణికుల చెల్లింపులను సులభతరం చేయడంతో పాటు యూరప్‌లోకి UPI విస్తరణకు నాంది పలికిందని చెప్పవచ్చు.
ఫ్రాన్స్
మారిషస్‌లో 2024లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. భారతదేశం నుంచి డిజిటల్ చెల్లింపులు, రెమిటెన్స్‌లను సాధ్యం చేస్తున్నాయి. ఈ చర్య రెండు దేశాల మధ్య ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలకు మద్దతు ఇస్తుంది.
మారిషస్
2023లో సింగర్‌పూర్‌లో యూపీఐ సేవలు ప్రారంభించారు. అక్కడ PayNowతో యూపీఐ అనుసంధానించారు. ఇది రెండు దేశాల మధ్య డబ్బు బదిలీలకు ఉపయోగపడుతుంది
సింగపూర్
2024లో శ్రీలకంతో UPI ఆధారిత సేవలు ప్రారంభించారు. భారత పర్యాటకులు, వ్యాపారాల కోసం వేగవంతమైన, సరసమైన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి ఇది సహాయపడుతుంది.
శ్రీలంక
భారతీయ ప్రయాణికుల కోసం UPI చెల్లింపులను సులభతరం చేయడానికి NPCI అక్కడ వీటిని ప్రారంభించారు. రెండు దేశాల మధ్య నగదు బదిలీలకు ఇది సహాయపడుతుంది