ప్రపంచంలో తక్కువ జనాభా ఉన్న దేశాలివే

Venkatrao Lella

Images: Pinterest

04 December 2025

ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా కలిగిన ఉన్న దేశం. జనాభా తక్కువ కలిగి ఉన్నప్పటికీ రోమన్ కాథలిక్ చర్చి ఉండటం వల్ల ఆధ్యాతికంగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.

వాటికన్ సిటీ

నియు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. జనాభా కేవలం 1800 మాత్రమే. ఇక్కడ సంస్కృతి పాలినేషియన్ సంప్రదాయం ఉంటుంది. న్యూజిలాండ్‌తో స్వేచ్ఛగా అనుబంధంగా స్వయం పాలనతో ఈ దేశం పనిచేస్తుంది.

నియు

పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న ద్వీప దేశం. దాదాపు 9 వేల మంది ప్రజలు నివిస్తున్నారు. వాతావరణ మార్పులు, సముద్రాలు పెరగడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం, చేపలు పట్టడం ఇక్కడి ప్రజల వృత్తి.

తువాలు

ప్రపంచంలోని అతి చిన్న రిపబ్లిక్‌లలో ఒకటి. తక్కువ జనాభా, ఎక్కువగా తీరప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.  ఫాస్ఫేట్ నిల్వలు అయిపోయిన తర్వాత ఈ దేశం తీవ్ర ఆర్థిక క్షీణతను ఎదుర్కుంటుంది.

నౌరు

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో స్వయం పాలన కలిగిన దేశం. 2025 నాటికి దాదాపు 13,263 మంది జీవిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో వలసల కారణంగా దేశం జనాభా తగ్గుతోంది.

కుక్ దీవులు

ఈపశ్చిమ పసిఫిక్‌లోని అనేక ద్వీపాల ఇది ఒకటి. అద్భుతమైన సముద్ర జీవవైవిధ్యం, స్వచ్ఛమైన సహజ సౌందర్యానికి ప్రసిద్ధి పొందింది. బలమైన పరిరక్షణ ప్రయత్నాలతో ఒక చిన్న జనాభాను సమతుల్యం చేస్తుంది.

పలావ్

2025 నాటికి సుమారు 33,500 మంది జనాభా జీవిస్తున్నారు. జనాభా పెరుగుదల స్థిరంగా ఉంది. అయితే సహజ మార్పులు, వలసల కారణంగా జనాభా తగ్గుతుంది.

శాన్ మారినో

మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న  చిన్న దేశం. ప్రస్తుత సంవత్సరం నాటికి సుమారు 36,000 మంది జనాభా ఉన్నారు. జనాభా సాంద్రత ఎక్కువగా ఉంటుంది

మార్షల్ దీవులు

2025 నాటికి దాదాపు 38,000 మంది జనాభా ఉన్నారు. విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక అవకాశాలు, సన్నిహిత సమాజ జీవనం ఆ దేశంలో ఉంటుంది.

మొనాకో

స్విట్జర్లాండ్ , ఆస్ట్రియా మధ్య ఉన్న దేశం. 2025 నాటికి దాదాపు 40,000 మంది జనాభా ఉన్నారు.  ఐరోపాలో అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో ఒకటిగా నిలిచింది.

లీచ్టెన్‌స్టెయిన్