ఇండియాలో అహ్మదాబాద్-ముంబై మధ్య తొలి హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం రైల్వేశాఖ ఇప్పటికే ఆ మార్గంలో ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతోంది. దీంతో పాటు మరో 7 మార్గాలను కూడా గుర్తించారు.
ముంబై-అహ్మదాబాద్
ఉదయపూర్ మీదుగా ఢిల్లీ-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు ప్రతిప్రాదనలు సిద్దంగా ఉన్నాయి. ఈ రెండు నగరాల మధ్య 878 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3.5 గంటల్లోనే చేరుకుంటుందని భావిస్తున్నారు.
ఢిల్లీ-అహ్మదాబాద్
ఇక ఢిల్లీ-చండీగఢ్-అమృత్‌సర్ బుల్లెట్ రైలు కారిడార్ 459 కిలోమీటర్లు ఉంటుంది. 2030 దీనిని పఠాన్‌కోట్ ద్వారా జమ్మూ వరకు దీనిని విస్తరించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేసింది.
ఢిల్లీ-అమృత్‌సర్
ఢిల్లీ- ఆగ్రా- కాన్పూర్- లక్నో- వారణాసి రూట్లో బుల్లెట్ ట్రైన్ 800 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ కారిడార్‌ను అయోధ్య మీదుగా నడిపించాలని రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేసింది.
ఢిల్లీ-వారణాసి
వారణాసి-పాట్నా-హౌరా బుల్లెట్ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడడవనుంది. ఈ ట్రైన్ సుమారు 760 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుందని రైల్వేశాఖ చెబుతోంది
వారణాసి-హౌరా
ముంబై- నాగ్‌పూర్ బుల్లెట్ రైలు నాసిక్ ద్వారా 765 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇక దీనిని విస్తరించడం ద్వారా నాగ్‌పూర్, వారణాసి మధ్య మరొక హై-స్పీడ్ రైలు మార్గాన్ని తీసుకురావాలని రైల్వేశాఖ భావిస్తోంది.
ముంబై-నాగ్‌పూర్
ముంబై- హైదరాబాద్ బుల్లెట్ రైలు రానుందని. ఈ కారిడార్‌లో గంటలకు 300 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 671 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది
ముంబై-హైదరాబాద్
చెన్నై నుండి మైసూరు వరకు బుల్లెట్ రైలు బెంగళూరు మీదుగా దాదాపు 435 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇందుకు రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది.