మనీ ప్లాంట్‌ పెంచగానే సరిపోదు.. ఈ దిశలో ఉంచితేనే సిరిసంపదలు!

16 April 2026

Jyothi Gadda

మనీ ప్లాంట్ కేవలం అందం కోసం పెంచే మొక్క మాత్రమే కాదు, ఇది ఇంటి ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే శక్తివంతమైన వాస్తు మొక్క. దానిని తప్పుడు దిశలో ఉంచితే లాభానికి బదులు నష్టం కలిగే ప్రమాదం ఉంది.

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఈ దిశకు అధిపతి గణపతి కావడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. శుక్ర గ్రహం ఈ దిశకు కారకుడు కాబట్టి ఐశ్వర్యం లభిస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశ (South-East) లో ఉంచడం అత్యంత శుభప్రద ఈ దిశలో మనీ ప్లాంట్‌ ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఈ దిశకు అధిపతి బృహస్పతి. శుక్రుడు, గురువు మధ్య వైరం ఉండటం వల్ల, ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ నేలకు తగలకూడదు. అవి ఎప్పుడూ పైకి పాకేలా ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి. తీగలు కిందకు ఉంటే అది ఆర్థిక పతనానికి సంకేతంఅ అంటున్నారు వాస్తు నిపుణులు.

మొక్కపై ఆకులు ఎండిపోతే లేదా రంగు మారితే వెంటనే వాటిని కత్తిరించాలి. ఎండిన ఆకులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. మనీ ప్లాంట్ ఎప్పుడూ ఇంటి లోపల ఉంటేనే ఎక్కువ ఫలితం ఉంటుంది.

పొరపాటున కూడా మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో ఉంచకూడదని, అలా చేస్తే ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది. మొక్క ఎప్పుడూ పైకి పాకేలా చూడాలని, ఆకులు ఎండిపోతే వెంటనే తొలగించాలి. 

మీ ఇంటి మనీ ప్లాంట్ కొమ్మను వేరే వాళ్లకు ఇవ్వకూడదని, అలా చేస్తే మీ ఇంటి లక్ష్మి వారి ఇంటికి వెళ్తుందని ఒక నమ్మకం ఉంది. మనీ ప్లాంట్ సరిగ్గా పెరిగి, పచ్చగా ఉంటేనే ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి.