AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కాల్చరు.. పూడ్చరు.. ఈ గ్రామంలో చనిపోయిన శవాలను ఏం చేస్తారో తెలుసా?

సాధారణంగా భారతీయుల సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని దహనం చేయడం లేదా భూమిలో పూడ్చిపెట్టడం చేస్తారు. కానీ ఇక్కడో దేశంలోని ఓ గ్రామానికి చెందిన వారు గ్రామంలో ఎవరైనా మరణిస్తే, వాళ్లను కాల్చడం కాని, పూడ్చడం కానీ చేయరట. దానికి బిన్నంగా వాళ్లు వింతైన పద్దతిలో అంత్యక్రియల చేస్తారట. ఇంతకు వాళ్లు శవాలను ఏం చేస్తారో తెలుసుకుందాం పదండి.

Viral News: కాల్చరు.. పూడ్చరు.. ఈ గ్రామంలో చనిపోయిన శవాలను ఏం చేస్తారో తెలుసా?
Trunyan Village Funeral Ritual
Anand T
|

Updated on: Apr 16, 2026 | 11:56 AM

Share

చనిపోయిన వారి శవాలను కాల్చడం లేదా, పూడ్చడం కానీ చేయకుండా వింతైన పద్దతిలో అంత్యక్రియలు చేసే ఆచారం ఇండోనేషియాలోని బాలి అనే ద్వీపంలో ఉన్న ట్రున్యాన్ అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో నివసించే వారిని బాలి అగా అని పిలుస్తారట. బృహత్తర పర్వతాల మధ్య చిన్న గ్రామంలో నివసించే వీరు తమ పూర్వీకుల ఆచారాలను చాలా కఠినంగా పాటిస్తారు. ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి శరీరాన్ని కాల్చడం గానీ, మట్టిలో పూడ్చడం గానీ చేయరు. చనిపోయిన వ్యక్తి దేహాన్ని అడవిలోని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ గాలి తగిలేలా వెదురుతో చేసిన పంజరాల్లో ఉంచుతారు.

పార్శీల వలే శవాలను రాబందులకు ఆహారంగా వదలకుండా మృతదేహాన్ని ఏ జంతువు లేదా పక్షి ముట్టుకోకుండా జాగ్రత్త పడతారు. చనిపోయిన వారిని వేరే జీవి తినడం అనేది మృతులకు చేసే అవమానంగా వీరు భావిస్తారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి మాంసం అంతా నశించిన తర్వాత, మిగిలిన తల బుర్రలు, ఎముకలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో ఒకచోట పేర్చి పెడతారు.

కఠిన నిబంధనలు

అంతే కాదు ఈ గ్రామంలో అంత్యక్రియలకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. కేవలం సహజంగా మరణించిన వారికి, వివాహమైన వారికి మాత్రమే ఈ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తారట. ఆత్మహత్య చేసుకున్న వారిని లేదా ప్రమాదాల్లో చనిపోయిన వారికి ఈ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించరట. వారిని వేరే చోట పూడ్చిపెడతారట.అలాగే ఈ అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి మహిళలు, పిల్లలు వెళ్లడానికి అవకాశం ఉండదట. ఒకవేళ అక్కడ స్థలం నిండిపోతే, పాత ఎముకలను పక్కకు జరిపి కొత్త శవాలను అక్కడ ఉంచుతారట.

వీడియో చూడండి..

ఎందుకు ఈ ఆచారం?

స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతం ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికే ఈ విధంగా అంత్యక్రియలు చేస్తారట. ఆ అగ్నిపర్వతాన్ని వారు దేవుడిగా భావిస్తారట. వారిని ప్రసన్నం చేసుకోవడానికి స్మశానంలో 11 పగోడాలు అంటే కోనేరు వంటి నిర్మాణాలు, ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారట.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us