AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు దంచికొట్టనున్న వర్షాలు..

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. దిగువ ట్రోపో ఆవరణంలో వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు దంచికొట్టనున్న వర్షాలు..
Andhra Pradesh Weather Alert
Krishna S
|

Updated on: Aug 03, 2026 | 1:58 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. దిగువ ట్రోపో ఆవరణంలో వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం

సోమ, మంగళవారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశముంది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. బుధవారం నాడు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు కొనసాగుతాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

సోమ, మంగళవారాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. గాలుల వేగం 40-50 కిమీగా ఉంటుంది. బుధవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

రాయలసీమ

సోమవారం కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి. మంగళవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది. బుధవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉనప్పటికీ, బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

రైతులు, ప్రజలకు సూచన

పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని, సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Follow Us