ప్రేమ వ్యవహారంలో ఇద్దరూ ఇష్టపడి శారీరక సంబంధం పెట్టుకుంటే, బ్రేకప్ తర్వాత దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొదటి నుంచీ మోసం చేయాలనే ఉద్దేశంతో బలవంతంగా లొంగదీసుకుంటే అది నేరమేనని, అటువంటి వాటికి శిక్ష తప్పదని బెంచ్ తేల్చిచెప్పింది. కేరళ కేసులో కీలక తీర్పునిచ్చింది.