AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా నెక్స్ట్ టీ20 ఎప్పుడో తెలుసా..? ఫ్యాన్స్‌కు తప్పని లాంగ్ వెయిటింగ్..!

Team India T20I Schedule: న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ ముగిసింది. ఇప్పుడు వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దీంతో టీమిండియా తదుపరి టీ20 మ్యాచ్ కోసం అభిమానులు డిసెంబర్ 22 వరకు ఎదురుచూడక తప్పదు. శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరగనుంది.

టీమిండియా నెక్స్ట్ టీ20 ఎప్పుడో తెలుసా..? ఫ్యాన్స్‌కు తప్పని లాంగ్ వెయిటింగ్..!
Team India T20i Schedule
Venkata Chari
|

Updated on: Nov 02, 2026 | 12:50 PM

Share

Team India T20I Schedule: న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో భారత్ ఓడినా, సిరీస్‌ను మాత్రం 3-2తో కైవసం చేసుకుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు ఆడింది. సెప్టెంబర్ నుంచి భారత జట్టు ఈ ఫార్మాట్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉంది. అఫ్గానిస్థాన్‌పై సిరీస్ గెలిచిన తర్వాత జపాన్ వెళ్లి ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. అక్టోబర్ 22 నుంచి కివీస్ పర్యటన మొదలైంది.

నెక్స్ట్ టీ20 ఎప్పుడు?

ఇప్పుడు న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్ తర్వాత టెస్టు సిరీస్ జరగనుంది. దీంతో టీమిండియా తర్వాతి టీ20 మ్యాచ్ కోసం కొంత కాలం వేచి చూడాల్సిందే. వచ్చే నెలలో శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. డిసెంబర్ 22న శ్రీలంకతో భారత్ తన తదుపరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు డిసెంబర్ 24న కటక్‌లో, డిసెంబర్ 27న పుణేలో జరగనున్నాయి.

టీమిండియా ఫామ్ డౌన్..

ఈ ఏడాది ఆరంభంలో భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ దక్కింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత్ సిరీస్‌లను కోల్పోయింది. జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌పై విజయాలు సాధించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవగా, వెస్టిండీస్‌తో సిరీస్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు న్యూజిలాండ్‌లో సిరీస్ విజయాన్ని అందుకుంది.

టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత భారత్ ఈ ఫార్మాట్‌లో 26 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 14 విజయాలు, 10 పరాజయాలు ఎదురయ్యాయి. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ 52 మ్యాచ్‌ల్లో కేవలం 8 మాత్రమే ఓడింది. అంతకుముందు రోహిత్ శర్మ సారథ్యంలో 69 మ్యాచ్‌ల్లో 12 ఓటములు ఎదురయ్యాయి. 2024 ప్రారంభం నుంచి 2026 టీ20 వరల్డ్ కప్ మధ్య 61 మ్యాచ్‌ల్లో టీమిండియా 7 మ్యాచ్‌ల్లోనే ఓడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు