Kashi Vishwanath : వెంకటేశ్ గొప్పతనం అదే.. ఆ విషయాలే ఆయనను ప్రత్యేక హీరోగా నిలబెట్టాయి.. టాలీవుడ్ నటుడు..
దర్శకుడిగా, సహయ నటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కాశీ విశ్వనాథ్. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినీరంగంలో తన అనుభవం, స్టార్ హీరోలతో అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే హీరో వెంకీతో ఉన్న సన్నిహిత బంధం గురించి వెల్లడించారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ రంగ ప్రవేశం, హీరో వెంకటేష్‌తో తన అనుబంధం, తెలుగు సినీ పరిశ్రమలోని పరిణామాలు, నటీనటులు ఎదుర్కొంటున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాల్యంలో తన తిరుగుబాటు స్వభావాన్ని గుర్తుచేసుకుంటూ, గ్రామ పంచాయతీ అధ్యక్షుడితో గొడవపడి ఒక పాట రాసి అందరికీ పంచిన సంఘటనను వివరించారు. ఈ సంఘటన తర్వాత తన స్నేహితులు సినిమా రంగంలోకి రావాలని ప్రోత్సహించారని, “తొలికోడి కూసింది” సినిమా షూటింగ్‌కు స్కూల్, కాలేజీ ఎగ్గొట్టి వెళ్లేవారని ఆయన పంచుకున్నారు. కాశీ విశ్వనాథ్ 90వ దశకం వరకు సినీ పరిశ్రమ స్వర్ణయుగంగా తెలిపారు. ఆ కాలంలో నటీనటులు తమ వృత్తి పట్ల అంకితభావంతో ఉండేవారని, వచ్చిన విజయాన్ని నిరాడంబరంగా స్వీకరించేవారని చెప్పారు. “హిట్ వస్తే తల పొగరు గానీ, ఆగపోవడం గానీ ఉండేది కాదు” అని పేర్కొన్నారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే తత్వాన్ని అర్థం చేసుకున్నారని, అందువల్ల ఆర్థికంగానూ, వ్యక్తిగతంగానూ సమతుల్యత పాటించారని వివరించారు. దీనికి విరుద్ధంగా, నేటి తరంలో కొంతమంది జీవితాన్ని, విజయాన్ని తప్పుగా అర్థం చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పావలా శ్యామల, రాజనాల, మహానటి సావిత్రి, చిత్తూరు నాగే వంటి దిగ్గజ నటులు సైతం తమ జీవిత చరమాంకంలో కష్టాలు పడిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. “తల పొగరు గానీ, రాష్ డెసిషన్స్ గానీ తీసుకుంటే లక్ష్మీదేవి గానీ, మనిషిని గానీ దెబ్బతీసేస్తది” అని హెచ్చరించారు.
వెంకటేష్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందని కాశీ విశ్వనాథ్ తెలిపారు. “గణేష్”, “ప్రేమించుకుందాం రా”, “కలిసుందాం రా” వంటి వెంకటేష్ జీవితాన్ని మలుపు తిప్పిన మూడు చిత్రాలకు తాను సహ-దర్శకుడిగా పనిచేశానని చెప్పారు. వెంకటేష్‌లో ఉన్న గొప్పతనం గురించి వివరిస్తూ, “ఏదీ శాశ్వతం కాదు, ఇది మన గొప్పతనం కాదు, లైఫ్ ఇలా జరుగుతా ఉంటది, ఫ్లోలో మనం వెళ్ళిపోవాలి” అనే ఆయన తత్వాన్ని కొనియాడారు. కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత, అనవసరమైన మాటలు మాట్లాడకపోవడం వంటి లక్షణాలు వెంకటేష్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయని అన్నారు. వెంకటేష్ నటన నుండి తాను కూడా కొన్నిసార్లు స్ఫూర్తి పొంది, భావోద్వేగ సన్నివేశాలలో అద్భుతంగా నటించగలిగానని కాశీ విశ్వనాథ్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా “కలిసుందాం రా” చిత్రంలోని ఫోటో సీన్, “నువ్వు నాకు నచ్చావు” చిత్రంలో భార్య చనిపోయిన తర్వాత కొడుకుతో మాట్లాడే సీన్ తనకు కళ్ళలో నీళ్లు తెప్పించిన సందర్భాలను వివరించారు.
ఒక దర్శకుడు లేదా సహ-దర్శకుడు ఒక సన్నివేశంలోని కంటెంట్‌ను స్పష్టంగా వివరించగలిగితే, రచయితలు అద్భుతమైన సంభాషణలను సృష్టించగలరని కాశీ విశ్వనాథ్ అన్నారు. పరుచూరి బ్రదర్స్‌తో కూర్చుని సన్నివేశాలను ఎలా మెరుగుపరచాలో చర్చించిన సందర్భాలను ఆయన గుర్తుచేసుకున్నారు. సురేష్ బాబు గురించి మాట్లాడుతూ, సాధారణంగా తమిళ దర్శకులకు అవకాశం ఇచ్చే ఆయన, తనకు “నువ్వు లేక నేను లేను” చిత్రంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చి తనను ప్రోత్సహించారని కృతజ్ఞతలు తెలిపారు
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
