AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

Phani CH
|

Updated on: Nov 02, 2026 | 12:17 PM

Share

దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లోని ప్రముఖ స్వీట్ షాపులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జి. పుల్లారెడ్డి స్వీట్స్ సహా పలుచోట్ల కుళ్లిన కూరగాయలు, ఎలుకల మలం, గడువు ముగిసిన ఆహారం, అపరిశుభ్ర వాతావరణం బయటపడ్డాయి. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు లైసెన్సులు సస్పెండ్ చేసి, హానికరమైన ఆహారాన్ని సీజ్ చేశారు. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.

దీపావళి పండుగ సమీపిస్తుండగా, హైదరాబాద్‌లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంచలనాత్మక దాడులు నిర్వహించారు. మొత్తం 13 ప్రత్యేక బృందాలు పోలీసుల సహాయంతో నగరంలోని 16 ప్రముఖ స్వీట్ తయారీ కేంద్రాలు, రిటైల్ యూనిట్లపై ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో వెలుగుచూసిన దృశ్యాలు అధికారులనే ఆశ్చర్యపరిచాయి. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత జి. పుల్లారెడ్డి స్వీట్స్ కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో కుళ్లిన కూరగాయలు, ఎలుకల మలం అవశేషాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, తప్పుదోవ పట్టించే లేబుళ్లు బయటపడ్డాయి. అంతేకాకుండా, స్వీట్లు తయారుచేసే ప్రాంతాలలో కనీస పరిశుభ్రత పాటించకపోవడం గమనార్హం. దీంతో అధికారులు తక్షణమే ఆ సంస్థ లైసెన్సును సస్పెండ్ చేసి, దాదాపు 15 లక్షల విలువైన 3,133 కేజీల హానికరమైన ఆహార నిల్వలను సీజ్ చేసి నాశనం చేశారు. ఇది కేవలం జి. పుల్లారెడ్డి స్వీట్స్‌కే పరిమితం కాలేదు. చార్మినార్‌లోని ఆఘా మిఠాయిగర్ రెస్టారెంట్, వనస్థలిపురంలోని స్వీట్ వన్ రుచులు, ఫలక్‌నుమాలోని బాలాజీ శ్రీకిషన్ మిఠాయి బండార్, కాటేదాన్‌లోని హిరానీ ఫుడ్స్ వంటి ఇతర ప్రఖ్యాత సంస్థలలో కూడా ఇదే విధమైన అపరిశుభ్ర పరిస్థితులు, ఎలుకల బెడద, లేబుల్ నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. అధికారులు వాటి లైసెన్సులు రద్దు చేసి, వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు. ప్రజలు పండుగ వేళ స్వీట్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

Published on: Nov 02, 2026 12:16 PM
Follow Us