AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Purnima: కార్తీక పౌర్ణమి ఎప్పుడు? గంగాస్నానం, దీపదానం చేయడం వల్ల కలిగే పుణ్యఫలాలు తెలుసా?

Kartik Purnima Date 2026 Telugu: 2026లో కార్తీక పౌర్ణమి నవంబర్ 23నా? 24నా? అనే సందేహం చాలామందిలో ఉంది. పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది? పవిత్ర గంగాస్నానం, దీపదానం, తులసి పూజ చేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఈ రోజున పాటించాల్సిన పూజా విధానాల గురించి తెలుసుకుందాం.

Kartik Purnima: కార్తీక పౌర్ణమి ఎప్పుడు? గంగాస్నానం, దీపదానం చేయడం వల్ల కలిగే పుణ్యఫలాలు తెలుసా?
Kartik Purnima Date 2026 Telugu
Rajashekher G
|

Updated on: Nov 02, 2026 | 12:49 PM

Share

Kartik Purnima Significance Telugu: హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం, దానధర్మాలు నిర్వహించడం వంటి ఆచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే 2026లో కార్తీక పౌర్ణమి తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొన్ని క్యాలెండర్లలో నవంబర్ 23 అని ఉండగా, మరికొన్నింటిలో నవంబర్ 24 అని పేర్కొంటున్నారు. మరి పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజున ఆచరించాల్సిన పూజా విధానాలు, దీపదానం ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి 2026 ఎప్పుడు?

పంచాంగం ప్రకారం 2026 నవంబర్ 23వ తేదీ రాత్రి 11:42 గంటలకు కార్తీక పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. నవంబర్ 24వ తేదీ రాత్రి 8:23 గంటలకు ముగుస్తుంది. తిథి ఉదయ సమయంలో ఉండటంతో నవంబర్ 24వ తేదీన కార్తీక పౌర్ణమి పవిత్ర స్నానాలు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. అదే రోజున దీపదానం కూడా నిర్వహించాలి.

కార్తీక పౌర్ణమి రోజున దీపదానం ఎందుకు చేయాలి?

కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం అత్యంత పుణ్యప్రదమైన కార్యంగా భావిస్తారు. ముఖ్యంగా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ రోజున నదులు, చెరువులు, ఆలయాల్లో దీపాలను వదిలి దీపదానం చేస్తారు. కార్తీక పౌర్ణమి తులసి ఆవిర్భావంతో కూడా ముడిపడి ఉందని పురాణ విశ్వాసాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించారని పురాణాలు పేర్కొంటున్నాయి. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ జయంతి కూడా ఇదే రోజున జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

గంగాస్నానం చేయడం వల్ల కలిగే ఫలితాలు

కార్తీక పౌర్ణమి రోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల శ్రీమహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. స్నానం చేసిన అనంతరం నదిలో దీపాన్ని వదిలితే పది యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. ఈ రోజున ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో దేవుడిని ఆరాధిస్తే పాపాలు తొలగి కోరుకున్న ఫలితాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

కార్తీక పౌర్ణమి స్నానం, పూజా విధానం

కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నదులు, సరస్సులు లేదా పవిత్రమైన జలాశయాల్లో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. నదులకు వెళ్లడం సాధ్యం కానివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని పవిత్ర స్నానం ఆచరించవచ్చు. స్నానం పూర్తయిన తర్వాత దీపాలు వెలిగించి శ్రీకృష్ణుడు, రాధాదేవిని భక్తితో పూజించాలి. అనంతరం పేదలకు, అవసరమైన వారికి అన్నదానం చేయడం, పండ్లు, స్వీట్లు, నిత్యావసర వస్తువులు, ధనం దానం చేయడం మంచిదని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దానధర్మాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పుణ్యఫలాలు, ఆచారాలు హిందూ మత విశ్వాసాలు, పురాణ సంప్రదాయాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ప్రాంతీయ ఆచారాలు, పంచాంగాల ప్రకారం వివరాల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు