AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో ప్లేస్ అంటూ ఛీకొట్టారు.. కట్‌చేస్తే.. కివీస్ గడ్డపై 5 వికెట్లతో చెలరేగిన టీమిండియా ప్లేయర్

India A vs New Zealand A: న్యూజిలాండ్ ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ఏ జట్టు వెనుకంజలో నిలిచింది. భారత్ ఏ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 346 పరుగులకు బదులుగా కివీస్ ఏ 424 పరుగులు చేసి 78 పరుగుల ఆధిక్యం సాధించింది. ముకేశ్ కుమార్ 5 వికెట్లతో రాణించగా, మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీశాడు. అయినా కివీస్ టెయిలెండర్లు పోరాడి జట్టును ముందంజలో నిలిపారు.

నో ప్లేస్ అంటూ ఛీకొట్టారు.. కట్‌చేస్తే.. కివీస్ గడ్డపై 5 వికెట్లతో చెలరేగిన టీమిండియా ప్లేయర్
India A Vs New Zealand A Mukhesh Kumar
Venkata Chari
|

Updated on: Nov 02, 2026 | 1:02 PM

Share

India A vs New Zealand A: భారత్ ఏ, న్యూజిలాండ్ ఏ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ముగింపునకు ముందు రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. భారత్ ఏ తొలి ఇన్నింగ్స్ స్కోరు 346కు సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఏ ఒక దశలో 338/8తో కష్టాల్లో పడింది. కానీ చివరి రెండు వికెట్లకు ఏకంగా 86 పరుగులు జోడించి, తొలి ఇన్నింగ్స్‌ను 424 పరుగుల వద్ద ముగించింది. దీంతో ఆతిథ్య జట్టుకు 78 పరుగుల విలువైన ఆధిక్యం దక్కింది.

ముకేశ్ ఐదు వికెట్ల ప్రదర్శన..

భారత బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ (Mukesh Kumar) అద్భుతంగా రాణించాడు. 29 ఓవర్లు వేసిన ఈ పేసర్ 87 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ప్రణాళికల నుంచి పక్కకు వెళ్లిన ఈ బౌలర్ ఇలాంటి ప్రదర్శనతో సెలెక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు.

సిరాజ్ సూపర్ వార్మప్..

రెండు టెస్టుల సిరీస్‌కు ముందు మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చక్కటి వార్మప్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 35 ఓవర్లు బౌలింగ్ చేసి 118 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. వీరిద్దరూ కలిసి కివీస్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం వికెట్లను పంచుకున్నారు. అయినా లోయర్ ఆర్డర్‌లో కివీస్ బ్యాటర్లు చూపిన పోరాటం భారత్ ఏ జట్టుకు తలనొప్పిగా మారింది.

రెండో ఇన్నింగ్స్‌లో సురక్షితంగా..

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఏ, రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 20, సాయి సుదర్శన్ (Sai Sudharsan) 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిగిలిన 11 ఓవర్లను ఈ ఇద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడేశారు. ఇప్పుడు చివరి రోజు భారత్ ఏ బ్యాటర్లు ఎంతవరకు పోరాడతారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు