అనంతపురం జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రాప్తాడు కేసు నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. బాలికలపై దాడి కేసులో పట్టుకునేందుకు వెళ్లగా, హేమంత్ కత్తితో పోలీసులపై తిరగబడ్డాడు. దీంతో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరపగా, హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.