Bigg Boss : బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్ లవ్ ట్రాక్.. స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన పేరెంట్స్.. దెబ్బకు ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్..
బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా యావత్ దేశమంత ఈ షోను ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఓవైపు నెగిటివిటీ పెరుగుతున్నప్పటికీ ఈ షో చూసేవారి సంఖ్య తగ్గడం లేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలు, హగ్గులు కామన్ అన్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఓ కంటెస్టెంట్ ప్రేమకథకు ఊహించని షాకిచ్చారు ఆమె పేరెంట్స్.

దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో బిగ్ బాస్ రియాల్టీ షోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా తెలుగులో రోహిత్ ఎలిమినేషన్ వివాదం నడుస్తుంది. అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ విన్నర్ మెటిరియల్ అని.. అతడిని కావాలనే ఎలిమినేట్ చేశారంటూ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరోవైపు బెంగాలీ బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్స్, హగ్గులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇవన్నీ ఒకెత్తైతే, మలయాళ బిగ్‌బాస్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా ఒక కంటెస్టెంట్ తల్లిదండ్రులే స్టేజ్‌పైకి వచ్చి తమ కూతురిని షో నుంచి బయటకు తీసుకెళ్లడం టెలివిజన్ చరిత్రలో సంచలనంగా మారింది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ మలయాళం’ షోలో నేహా ఫాతిమా అనే ఒక కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. తన ఆటతీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గేమ్‌లో భాగంగా ఆమె మరో కంటెస్టెంట్ సంతోష్ రాజ్ తో సన్నిహితంగా మెలిగారు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య నడిచిన లవ్ ట్రాక్ షోకే హైలైట్‌గా నిలిచింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, సంతోష్ రాజ్‌కు నేహా ఫాతిమా బహిరంగంగానే లవ్ ప్రపోజల్ చేసింది. నేహా చేసిన ప్రపోజల్‌కు సంతోష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ లవ్ ట్రాక్ పై నేహా తల్లిదండ్రులకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమ కుటుంబ పరువు, మత సంప్రదాయాలకు విరుద్ధంగా కూతురు వ్యవహరిస్తోందని వారు భావించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
దీంతో వారాంతపు ఎపిసోడ్లో హోస్ట్ మోహన్‌లాల్ సమక్షంలో నేహా తల్లిదండ్రులు నేరుగా స్టేజ్‌పైకి వచ్చారు. తమ కూతురి ప్రవర్తనపై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమెను వెంటనే షో నుంచి బయటకు పంపించాలని పట్టుబట్టారు. పెద్దల ఆందోళన, కుటుంబ పరువు దృష్ట్యా నిర్వాహకులు కూడా నేహా ఫాతిమాను అర్ధాంతరంగా హౌస్ నుంచి బయటకు పంపించాల్సి వచ్చింది. దాంతో ఆమె బిగ్‌బాస్ ప్రయాణం ఎటువంటి ముగింపు లేకుండానే మధ్యలోనే ముగిసింది. బిగ్‌బాస్ చరిత్రలో లవ్ ట్రాక్ వివాదం కారణంగా కంటెస్టెంట్ బయటకు వెళ్లడం ఇదే మొదటిసారిన చర్చ జరుగుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
