కాఫీతో మొదలై కేసులవరకు..! పెళ్లి నగలు ఇవ్వడంలేదని నటి.. ఆమెకు ఇంకొకరితో ఎఫైర్ ఉందని భర్త
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లి, విడాకులు అనేవి రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారిపోతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా బ్రేకప్స్‌తో, రిలేషన్ షిప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.

సినిమా విషయాలు విశేషాలతో పాటు సొషల్ మీడియాలో సినీ సెలబ్రెటీస్ పర్సనల్ విషయాలు కూడా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీతారల ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి నిత్యం ఏదోక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. కొందరు రెండు, మూడేళ్లకు విడిపోతుంటే మరికొందరు 18,20 ఏళ్ళు కలిసున్నా తర్వాత కూడా విడిపోతున్నారు. అయితే తాజాగా ఓ నటి పెళ్లైన నాలుగు నెలల నుంచే భర్తతో అత్తింటివారితో గొడవలు మనస్పర్థలు తలెత్తాయని తెలిపింది. ఒక్క కాఫీతో మొదలైన గొడవ పెరిగి రచ్చ రచ్చ అయ్యిందని తెలుస్తుంది. అంతే కాదు ఆమె ఇప్పుడు భర్త పై, అత్తింటివారిపై పోలీస్ కేసు కూడా పెట్టింది. భర్త కూడా ఆమె పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇంతకూ ఆ జంట ఎవరంటే.. బుల్లితెర నటి ఫేమస్ సైన్స్ డ్రామా సిరీస్ అయిన అపోలీనా ఫేమ్ అదితి శర్మ తన భర్త అభిజిత్ కౌశిక్ తో విడిపోయినట్లు తెలుస్తోంది. పెళ్లైన నాలుగు నెలల నుంచే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2024 నవంబర్ నెలలో రహస్యంగా పెళ్లి చేసుకున్న అదితి శర్మ, అభిజిత్ కౌశిక్.. పెళ్ళైన తర్వాత నాలుగు నెలలు కూడా కలిసి ఉండలేకపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా
తన భర్త అభినీత్ కౌశిక్, అత్త ఊర్మిళా కౌశిక్ (65), ఆడపడుచు కీర్తి కౌశిక్ (29) లపై ఆమె ముంబైలోని గోరేగావ్ పోలీసు స్టేషన్‌లో గృహహింస కేసు పెట్టింది అదితి శర్మ. సీరియల్స్ ద్వారా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అదితి శర్మ. అటు సీరియల్స్.. ఇటు షోలలో కనిపిస్తూ అభిమానులను సంపాదించుకుంది. అయితే గత నాలుగేళ్లుగా అదితి అభిజిత్ కౌశిక్ తో సహజీవనం చేస్తుంది. 2024 నవంబర్ లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన కెరీర్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అదితి భర్త అభిజిత్ గతంలో తెలిపారు. కానీ ఇప్పుడు ఆమె ప్రవర్తన నచ్చక విడిపోవడానికి రెడీ అయినట్లు తెలిపారు.
ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు
గతంలో ఆయన మాట్లాడుతూ.. అదితి శర్మ అపోలీనా కో స్టార్ సమర్థ గుప్తాతో సన్నిహితంగా ఉంటుందని.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తాను చూశానని అభిషేక్ అన్నాడు. అయితే విడాకులు తీసుకోవడానికి అదితి శర్మ ఫ్యామిలీ రూ.25 లక్షలు డిమాండ్ చేశారని అభిషేక్ అన్నారు. ఇక ఇప్పుడు అదితి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, మంగళసూత్రం, గాజులను అత్త ఊర్మిళా కౌశిక్ తన వద్దే ఉంచుకుందని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో అదితి పేర్కొంది. అలాగే తన భర్త కుటుంబంపై గృహహింస కేసు పెట్టింది అదితి శర్మ. ఇప్పుడు వీరి యవ్వారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




