Special Parliament Session: డీలిమిటేషన్.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది..
మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న 'ఫార్ములా'నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.

మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న ‘ఫార్ములా’నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తుండడంతో.. సౌత్ స్టేట్స్ గేర్ మార్చి రెడీగా ఉన్నాయి. విపత్తు సృష్టించడానికి సైతం సై అంటున్నాయి. గురువారం ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ విస్తరణ, మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం మూడు అనుసంధానిత బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న భయం.. జనాభా ప్రాతిపదికన చేస్తారేమో అని. దీనిపై ‘హమ్మయ్య’ అనుకునేంత రిలీఫ్ ఇచ్చింది కేంద్రం. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచడం లేదని తేల్చి చెప్పింది. ముందు నుంచి చర్చ జరుగుతున్నట్టుగా ప్రోరెటా ప్రకారమే.. డీలిమిటేషన్‌కు వెళ్తున్నట్టు ప్రకటించింది. 50 శాతం ఫార్ములా అప్లై చేయడమే ఈ ప్రోరెటా పద్దతి. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న ఎంపీ స్థానాలను 50 శాతం పెంచడమే ఈ ప్రోరెటా అంటోంది కేంద్రం.
ఇక సీట్ల నిష్పత్తి విషయంలోనూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతంగా ఉంది. ఈ 24 శాతం వాటా అనేది సీట్ల పెంపు తరువాత కూడా యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం చెబుతోంది. డీలిమిటేషన్ యాక్ట్-2026 బిల్లులో ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావించామంది కేంద్రం. దీనిపై ఎవరూ వక్రీకరణలు, తప్పుడు కథనాలు ఇవ్వొద్దన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ అంశంపై పార్లమెంట్‌లో మరింత క్లారిటీ ఇస్తామని చెప్పింది.
బట్.. ప్రోరెటా పద్దతికి ఒప్పుకునేదే లేదంటోంది ఇండీ కూటమి. రాహుల్ గాంధీ దీనిపై గట్టిగానే ఫైర్ అవుతున్నారు. డీలిమిటేషన్‌తో కేంద్ర ప్రభుత్వం గెర్రీమాండరింగ్‌కు పాల్పడే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అంటే.. నియోజకవర్గాల సరిహద్దులను బీజేపీకి అనుకూలంగా మార్చుకుని, ఎక్కువ సీట్లు వచ్చేలా ఆ పార్టీ కుట్ర చేస్తోందని చెప్పడానికి ఈ గెర్రీమాండరింగ్ అనే పదం వాడారు రాహుల్ గాంధీ. ఈ ప్రక్రియలో దక్షిణాది సహా ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని అల్టిమేటం ఇచ్చారు.
50 శాతం ఫార్ములాతో అందరికీ న్యాయమే జరుగుతుందని చెబుతున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు మరింత పెద్ద రాష్ట్రాలుగా మారుతుంటే.. కేరళ, తెలంగాణ వంటి తక్కువ ఎంపీ స్థానాలున్న రాష్ట్రాలు మరింత చిన్నగా మారతాయని వాదిస్తున్నాయి. పైగా.. 50 శాతం ఫార్ములాతో రాష్ట్రాల మధ్య ఎంపీ సీట్ల అంతరం భారీగా పెరిగిపోతుందనే అభ్యంతరాన్ని చెబుతున్నాయి. అంతేకాదు.. ఇప్పటి వరకు లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం ఉంటే.. 50 శాతం ఫార్ములా తరువాత ఆ వాటా తగ్గుతుందనే వాదనను హైలైట్ చేస్తున్నారు. ఓవరాల్‌గా.. ఈ మూడు రోజుల పాటు డీలిమిటేషన్‌పై పెద్ద రణరంగమే జరగబోతోంది.
‘మహిళా రిజర్వేషన్’ బిల్లుకు అంతా మద్దతు..
‘ఆమె’ అడుగు చట్టసభల్లో గట్టిగా పడబోతోంది. దశాబ్దాల నిరీక్షణ తరువాత ‘ఆమె’ గెలుస్తోంది. అతివలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ దక్కబోతోంది. ఈ విషయంలో ఎక్కడా వ్యతిరేకత లేదు. మహిళా కోటాకు అడ్డొచ్చే ప్రత్యర్ధే లేడు. అపోజ్ చేస్తున్న పార్టీనే లేదు. యునానిమస్. ‘మహిళా రిజర్వేషన్’ కేవలం ఒక బిల్లు ఆమోదం కాదు.. భారత ప్రజాస్వామ్య ముఖచిత్రాన్ని మార్చే ఒక రెవెల్యూషన్. ఆ బిల్లుకు వస్తున్న మద్దతు కూడా ఒక విప్లవమే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కొట్లాటే లేదసలు. ప్రతిపక్షాలది, అధికార పక్షాలది ఒకే మాట, ఒకే బాట. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండీ కూటమి సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
ఏపీలో టీడీపీ, వైసీపీలకు అభ్యంతరం లేదు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు వ్యతిరేకించే ఉద్దేశమే లేదు. సో, అంతటా పాజిటివ్‌నెస్‌తో నిండిపోయింది. ఇలాంటి వాతావరణం బహుశా దేశ రాజకీయ చరిత్రలో అత్యంత అరుదు కావొచ్చు. పైగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు తుది అడుగు పడుతున్న వేళ.. పెద్ద ఎత్తున సంబరాలకు స్ట్రాటజీని కూడా సిద్ధం చేసుకుంది టీడీపీ. ఏకగ్రీవంగా మద్దతివ్వాలని ఆల్రడీ సీఎం చంద్రబాబు అన్ని పక్షాలనూ కోరారు కూడా.
కాకపోతే.. 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయి గానీ, ఆ నెంబర్ ఎంతన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. డీలిమిటేషన్‌పైనే భవిష్యత్తులో ఎంత మంది మహిళలు చట్టసభల్లోకి అడుగుపెడతారన్న దానిపై ఓ స్పష్టత వస్తుంది. లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850 సీట్లకు పెంచాలనుకుంటోంది కేంద్రం. ఒకవేళ అదే లెక్క అయితే మాత్రం.. 2029లో 850కి 280 మంది మహిళలు లోక్‌సభలో అడుగుపెడతారు. లేదూ.. ఇప్పుడున్న 543 సీట్ల లెక్కే అయితే మాత్రం 179 మంది మహిళలు సభలో అడుగుపెడతారు. బట్.. ఏది ఏమైనా ఇప్పుడున్న 74 మంది మహిళలు.. మున్ముందు లోక్‌సభలో డబుల్ లేదా ట్రిపుల్ అవుతారు. అది మాత్రం పక్కా.
