Andhra Pradesh: మిస్టరీగా గ్యాస్ లీకేజీ ఘటన.. కంపెనీ మూసివేత.. వాస్తవాల అధ్యయానికి నిపుణుల కమిటీ

అనకాపల్లి(Anakapalle) జిల్లా అచ్యుతాపురంలో జరిగిన గ్యాస్ లీకేజ్‌ ఉదంతం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. విషవాయువు ఎలా వచ్చింది. బ్రాండిక్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఎలా సోకిందనే విషయంపై రకరకాల సందేహాలొస్తున్నాయి....

Andhra Pradesh: మిస్టరీగా గ్యాస్ లీకేజీ ఘటన.. కంపెనీ మూసివేత.. వాస్తవాల అధ్యయానికి నిపుణుల కమిటీ
Gas Leak
Follow us

|

Updated on: Jun 04, 2022 | 4:21 PM

అనకాపల్లి(Anakapalle) జిల్లా అచ్యుతాపురంలో జరిగిన గ్యాస్ లీకేజ్‌ ఉదంతం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. విషవాయువు ఎలా వచ్చింది. బ్రాండిక్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఎలా సోకిందనే విషయంపై రకరకాల సందేహాలొస్తున్నాయి. ఈ లీకేజ్ తమ పాపం కాదంటోంది బ్రాండిక్స్ కంపెనీ(Brandix Company). తమ ఫ్యాక్టరీలో కెమికల్స్ వాడకమే ఉండదని, గ్యాస్ ఎటునుంచి ఎలా వచ్చిందో ప్రభుత్వం వేసిన కమిటీయే చెప్పాలంటూ చేతులెత్తేశారు బ్రాండిక్స్ సీఈఓ. ప్రస్తుతానికి విషవాయువు పీల్చి అనారోగ్యం బారిన పడ్డ 200 మంది సేఫ్ అంటోంది బ్రాండిక్స్. వాళ్లందరి బాగోగుల్ని చూసుకునే బాధ్యత తామే తీసుకున్నామని చెప్పారు సీఈఓ. నిజానికి ఘటన జరిగిన సమయంలో తాము చాకచక్యంగా వ్యవహరించడం వల్లే తీవ్రత తగ్గిందన్నారు. రెండురోజులు సెలవు కావడంతో సోమవారం కంపెనీ ఓపెన్ చేసే విషయం తర్వాత చెబుతామన్నారు. అటు విషవాయువు ఉదంతం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన ప్రభుత్వ కమిటీ నిజనిర్ధారణ కోసం విచారణ కొనసాగిస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు గ్యాస్ లీకేజీ ఘటన జరిగింది. ప్రమాదకరమైన విషవాయువులు గాలిలో కలవడంతో ఉద్యోగులకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉద్యోగులు కంపెనీ తలుపులు తోసుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. మధ్యాహ్నం 1గంటకు నలుగురు ఉద్యోగినులు కంపెనీ అంబులెన్స్‌లో అచ్యుతాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. 2గంటలకు సీడ్స్ కంపెనీకి ఎదురుగా ఉన్న ఓ రసాయన పరిశ్రమ నుంచి అమోనియా గ్యాస్ లీక్ అయ్యిందని నిర్ధారించారు. 3.30గంటలకు కంపెనీ నుంచి బాధితులు హాస్పిటల్స్‌కు క్యూ కట్టారు. సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ రవిసుభాష్, ఎస్పీ గౌతమి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 4.30కు అస్వస్థతకు గురైన మహిళా ఉద్యోగులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 7.00 ఘటనా స్ధలానికి పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్, ఎంపీ, ఎమ్మెల్యేలు చేరుకున్నారు.

అనకాపల్లి గ్యాస్‌ లీక్‌ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీకైన గ్యాస్‌ పోరస్‌ నుంచి వచ్చింది కాదని, బ్రాండిక్స్‌ ఏసీడక్ట్‌ నుంచి విషవాయువు లీకై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రతను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. నిర్ధారించేందుకు ఎక్స్‌పర్ట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటివరకు బ్రాండిక్స్‌ కంపెనీని మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు