Andhra Pradesh: ఆలయ పునర్నిర్మాణ పనుల్లో బయల్పడిన శ్రీకృష్ణుడి విగ్రహం.. పూజల కోసం బారులు తీరిన భక్తులు
వేణుగోపాలస్వామి ఆలయ ధ్వజస్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో పునాదిని తవ్వుతుండగా శ్రీ కృష్ణుడు విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహం శతాబ్దాల కాలం నాటిదని తెలుస్తోంది.
Andhra Pradesh: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి మండలంలో (Anaparthi Mandal )ప్రముఖ దేవాలయం పొలమూరు వేణుగోపాలస్వామి ఆలయం (Venugopala Swamy Temple). ఈ ఆలయాన్ని స్థానికులు పునర్మించాలని భావించారు. ఈ నేపధ్యంలో పునర్నిర్మాణ పనులను చేపట్టారు. ఈ పనులను చేస్తున్న సమయంలో శ్రీ కృష్ణుడి విగ్రహం బయల్పడింది. ఆలయ ధ్వజస్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో పునాదిని తవ్వుతుండగా శ్రీ కృష్ణుడు విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహం శతాబ్దాల కాలం నాటిదని తెలుస్తోంది. శ్రీ కృష్ణుడి విగ్రహ విషయం తెలియగానే గ్రామస్థులతో పాటు.. ఇరుగుపొరుగు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. పూజలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..