Sucess Story: సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజం సుధీర్ కుమార్ రెడ్డి.. ఓటమి నుంచి విజయం వరకూ ప్రయాణం..

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ ఫలితాల్లో 69 వ ర్యాంకు సాధించాడు. గడ్డం రామసుబ్బారెడ్డి రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్ కుమార్ రెడ్డి నాలుగో ప్రయత్నంలో సివిల్స్ పరీక్ష ఫలితాల లో మెరుగైన ర్యాంకు సాధించారు

Sucess Story: సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజం సుధీర్ కుమార్ రెడ్డి.. ఓటమి నుంచి విజయం వరకూ ప్రయాణం..
Ap Civil Ranker
Follow us

|

Updated on: Jun 03, 2022 | 8:15 PM

Sucess Story: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చేరుకున్న గడ్డం సుధీర్ రెడ్డి కి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. సుధీర్ ను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 69వ ర్యాంకు సాధించిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి.. స్వగ్రామం చేరుకోవడంతో  కుటుంబ సభ్యుల్లో ఆనందం మిన్నంటింది. పాండురంగ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సుధీర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు.. అనంతరం కోవెలకుంట్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా స్వగృహానికి చేరుకున్న సుధీర్ కుమార్ రెడ్డి ని సాదర స్వాగతం గా కుటుంబ సభ్యులు గృహంలో కి తీసుకెళ్లారు.

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ ఫలితాల్లో 69 వ ర్యాంకు సాధించాడు. గడ్డం రామసుబ్బారెడ్డి రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్ కుమార్ రెడ్డి నాలుగో ప్రయత్నంలో సివిల్స్ పరీక్ష ఫలితాల లో మెరుగైన ర్యాంకు సాధించారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందాలు మిన్నంటాయి.

విద్యాభాసం:  పాణ్యం మండలం గోనవరం గ్రామానికి చెందిన గడ్డం రామ సుబ్బారెడ్డి , రమాదేవి లు. సుధీర్ రెడ్డిది మొదటి నుండి వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం పై జీవనం ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 25 సంవత్సరాల క్రితం కోవెలకుంట్ల పట్టణం లో స్థిరపడ్డారు. సుధీర్ కుమార్ రెడ్డి విద్యాభ్యాసం కోవెలకుంట్ల నుండి మొదలైంది.  1 నుండి 4 వ తరగతి వరకు కోయిలకుంట్ల సత్య సాయి విద్యాలయం లో కొనసాగగా 5వ తరగతి నంద్యాల పట్టణంలోని గుడ్ షెఫర్డ్ స్కూల్ లో కొనసాగింది. 6, 7 తరగతులు కర్నూలు మాంటిస్సోరి లో విద్యనభ్యసించిన సుధీర్ కుమార్ రెడ్డి.. 8, 9, 10 తరగతుల ను గుడివాడలోని కే.అర్.ఆర్ గౌతమ్ స్కూల్ లో చదివారు. ఇంటర్ విద్యను విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం పశ్చిమబెంగాల్ లోని ఖరగ్ పూర్ నుండి IIT పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

సివిల్స్: సివిల్ సర్వీస్ సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీ లో ఉంటూ శిక్షణ తీసుకున్నారు. రాజి రామన్ & రవి iAs కోచింగ్ సెంటర్ లో ఉంటూ సివిల్స్ కు సిద్ధమయ్యారు. సివిల్స్ రాసిన మొదటి ,రెండు ప్రయత్నాల్లో పరాజయం పొందినప్పటికీ మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో వెనుదిరిగారు. అయినప్పటికీ పట్టువదలకుండా నాలుగోసారి ప్రయత్నించగా సివిల్స్ ఫలితాలు 69వ వరకు సాధించారు.  దీంతో సుధీర్ కుమార్ రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  కోవెలకుంట్ల పట్టణంలోని సుధీర్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద సందడి నెలకొంది. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సుధీర్ కుమార్ రెడ్డి ఇంటికి చేరుకొని తల్లిదండ్రులైన రామసుబ్బారెడ్డి రమాదేవి లకు అభినందనలు తెలుపుతున్నారు.  తమ కుమారుడు తమ కలను నెరవేర్చడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  తమ కుమారుడు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

TV9 Reporter, Kurnool district

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..