AP News: ఆత్మహత్య చేసుకుంటున్నాను.. డయిల్ 100కు ఫోన్ కాల్.. చివరకు ఏమైందంటే..?
సుబ్బారావు అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
Prakasam district: ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ వ్యక్తిని ప్రకాశం జిల్లా కంభం పోలీసులు సురక్షితంగా కాపాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం పూల సుబ్బయ్య కాలనీకి చెందిన పూసలపాడు సుబ్బారావు అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కంభం పట్టణ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన సుబ్బారావు.. డైల్ 100 కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు కంభం (Kambham police) ఎస్ఐ నాగమల్లేశ్వరరావుకు సమాచారం అందించారు.
హుటాహుటిన రంగంలోకి దిగిన కంభం ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, సుబ్బారావు వాడుతున్న మొబైల్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి ఎట్టకేలకు అతనిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే సుబ్బారావు భార్యను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.ఆత్మహత్య చేసుకోబోతున్న సుబ్బారావును సురక్షితంగా కంభం పోలీసులు రక్షించడం పై సుబ్బారావు కుటుంబ సభ్యులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..