ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. శిశువు ప్రాణం తీసిన చీమలు.. ఐసీయూలో

నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో చికిత్స పొందుతున్న శిశువుకు చీమలు కుట్టి మరణించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. శిశువు ప్రాణం తీసిన చీమలు.. ఐసీయూలో
Baby Dies
Shaik Madarsaheb

|

Jun 03, 2022 | 5:02 PM

Three-day-old infant dies of ant bites: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. చీమలు కుట్టడంతో మూడురోజుల శిశువు మృతిచెందింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా ఆసుపత్రిలో జరిగింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో చికిత్స పొందుతున్న శిశువుకు చీమలు కుట్టి మరణించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. మహోబా జిల్లా కుల్పహర్ తహసీల్ ప్రాంతంలోని ముధారి గ్రామానికి చెందిన సురేంద్ర రైక్వార్ గర్భిణి అయిన భార్య సీమను ఆసుపత్రిలో చేర్చారు. మే 30న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు అస్వస్థతకు గురికావడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే ఆ శిశువుకు చీమలు కుట్టడంతో జూన్‌ 2న మరణించినట్లు పేర్కొంటున్నారు.

ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ చిన్నారి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో పాటు డాక్టర్ రూ.6,500 లంచం తీసుకున్నారని, అయినా సరిగా చికిత్స అందించలేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వార్డులో దుమ్ము, చీమలు ఉన్నాయని సిబ్బంది, వైద్యులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న కొత్వాలి పోలీసులు, ఎస్‌డిఎం సదర్‌ జితేంద్రకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు ఈ వ్యవహారంపై చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu